Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్.. సుక్కు.. ఒక బౌద్ధ గురువు కథ
By: Tupaki Desk | 22 May 2017 5:23 AM GMT జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో ‘నాన్నకు ప్రేమతో’ ఒక మైలురాయి లాంటి సినిమా. తారక్ నటనా కౌశలానికి అదో గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. వసూళ్ల పరంగా చూసినా ‘నాన్నకు ప్రేమతో’ ఎన్టీఆర్ కెరీర్లో ప్రత్యేకంగా నిలుస్తుంది. అది అతడికి తొలి రూ.50 కోట్ల షేర్ మూవీ. అందుకే ఈ చిత్రాన్ని చాలా ప్రత్యేకంగా చెప్పుకుంటాడు ఎన్టీఆర్. ఐతే ఎన్టీఆర్ కంటే కూడా తనకే ఈ సినిమా చాలా చాలా ప్రత్యేకమని.. దాన్ని ఎప్పుడూ మరిచిపోలేనని అంటున్నాడు సుక్కు. తన ప్రొడక్షన్లో తెరకెక్కిన ‘దర్శకుడు’ టీజర్ ను ఎన్టీఆర్ చేతుల మీదుగా లాంచ్ చేసిన సందర్భంగా సుకుమార్.. ‘నాన్నకు ప్రేమతో’ అనుభవాల్ని గుర్తు చేసుకుంటూ ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పాడు. ఆ స్టోరీ ఏంటో సుక్కు మాటల్లోనే తెలుసుకుందాం పదండి.
‘‘ఎన్టీఆర్ తో నా అనుబంధం గురించి వివరించాలంటే ఒక కథ చెప్పాలి. ఒక బౌద్ధ గురువు.. అతడి శిష్యుడు కలిసి ఒక చోటి నుంచి మరో చోటికి ప్రయాణం చేస్తున్నారు. వాళ్లు వంద మైళ్ల దూరం ప్రయాణించాలి. మధ్యలో వారికి ఓ అమ్మాయి కనిపించింది. ఆ రోజు తన పెళ్లి చూపులు కావడంతో బట్టలు పాడవకుండా నది ఎలా దాటాలా అని చూస్తుంటుంది. బౌద్ధ గురువును సాయం అడుగుతుంది. ఆయన ఆమెను ఎత్తుకుని నది దాటిస్తాడు. ఐతే ఇది చూసి శిష్యుడు ఆశ్చర్యపోతాడు. చాలా దూరం ప్రయాణించాక ఉండబట్టలేక గురువును అడుగుతాడు. మీరు సన్యాసి అయి ఉండి అమ్మాయిని ఎలా తాకారు.. మోశారు.. అని అడిగితే.. ‘నేనా అమ్మాయిని ఎప్పుడో దించేశాను. నువ్వు మాత్రం ఇంకా మోస్తూనే ఉన్నావు’ అని బదులిస్తాడు గురువు. ఇక్కడ తారక్ గురువు అయితే.. నేను శిష్యుడిని. అతను ‘నాన్నకు ప్రేమతో’ సినిమాను ఒడ్డునపడేసి తన పాటికి తాను వెళ్లిపోయినా.. నేనింకా ప్రేమతో అందులోనే ఉండిపోయాను. ఎన్టీఆర్ నా ప్రొడక్షన్లో వచ్చిన తొలి సినిమా ‘కుమారి 21 ఎఫ్’ టీజర్ లాంచ్ చేయడమే కాక.. ఆ సినిమా చూసి చేసిన ట్వీట్‌తో అది చాలా పెద్ద స్థాయికి వెళ్లిపోయింది. మళ్లీ ఇప్పుడు తనతోనే టీజర్ లాంచ్ చేయిద్దామని అడగాలంటే ఇబ్బందిగా అనిపించింది. కానీ అడగ్గానే మరో ఆలోచన లేకుండా ఒప్పుకున్నాడు. ఇకపై కూడా నా ప్రొడక్షన్లో వచ్చే ప్రతి సినిమా టీజర్ తనతోనే లాంచ్ చేయిద్దామనుకుంటున్నా’’ అంటూ నవ్వేశాడు సుకుమార్.