Begin typing your search above and press return to search.
ఇంత పవర్ ఫుల్ స్టోరీని తెరపైనే చూడాలనుకున్నా!-సుక్కూ
By: Tupaki Desk | 6 April 2021 5:03 AM GMTసాయి తేజ్ కథానాయకుడిగా దేవాకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రిపబ్లిక్. ఈ మూవీ టీజర్ ని స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. టీజర్ రిలీజ్ వేదికపై రిపబ్లిక్ గురించి సుక్కూ చెప్పిన ఓ సంగతి తాజాగా అభిమానుల్లో చర్చకు వచ్చింది.
టీజర్ ఎంతో ఎమోషనల్ గా ఆకట్టుకుందని దేవాకట్టా టీమ్ ని ప్రశంసించిన సుక్కూ తన ప్రసంగంలో మరో ఆసక్తికర విషయం చెప్పారు. సినిమా సెట్స్ కెళ్లక ముందే దేవా కట్టా తనను కలుసుకుని రిపబ్లిక్ కథను వివరించాలనుకున్నారని సుకుమార్ వెల్లడించారు. అయితే ఇంత పవర్ ఫుల్ కథను పెద్ద తెరపై చూడాలి. అందుకే కథ చెబుతానన్నా వినాలనుకోలేదని సుక్కూ దేవాతో అన్నారట.
``ప్రస్థానం విడుదలైనప్పుడు నేను దేవకట్టాను కలుసుకున్నాను. వ్యక్తిగతంగా ప్రశంసించాను. రిపబ్లిక్ కథను దేవా నాకు వివరించాలనుకున్నప్పుడు అతని గొప్ప ఆలోచనను దృష్టిని తెరపై చూడాలని నేను కోరుకున్నాను`` అని సుకుమార్ చెప్పారు. సుక్కూ లాంటి ట్యాలెంటెడ్ డైరెక్టర్ దేవాకట్టాను ఆయన ప్రస్థానం సినిమాను ఎంతగా ఆరాధిస్తారో ఆ మాటలే చెప్పాయి.
రిపబ్లిక్ జూన్ 4 న విడుదలవుతోంది. టీజర్ ఆద్యంతం అవినీతి కాన్సెప్ట్.. ఎమోషనల్ పొలిటికల్ డ్రామాతో ఆకట్టుకుంది. ఈ చిత్రంలో కొల్లేరు సమస్య గురించి దేవాకట్టా ప్రస్థావించడం ఆసక్తిని రేకెత్తించింది. ప్రభువుల చేతిలో నలిగిపోయే సామాన్యులు రాజకీయ అధికార వ్యవస్థలన్ని దేవా కట్టా టచ్ చేస్తున్నారు.