Begin typing your search above and press return to search.

అయ్యబాబోయ్ మళ్ళీ అప్డేట్ ఇచ్చాడు

By:  Tupaki Desk   |   16 Jan 2018 2:16 PM IST
అయ్యబాబోయ్ మళ్ళీ అప్డేట్ ఇచ్చాడు
X
బాహుబలి2 ఘనవిజయం తర్వాత అనేక బడా ప్రాజెక్టులకు సంబంధించి.. పలు భాషలలో ప్రకటనలు వచ్చాయి. తమిళ ఫిలిం మేకర్ సి సుందర్ కూడా ఓ భారీ చిత్రానికి సంబంధించి ప్రకటన చేశారు. సంఘమిత్ర అంటూ ఓ మహిళా ప్రాధాన్యం ఉన్న జానపద చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు చెప్పారు.

కానీ ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం జరుగుతోంది. మొదటగా సంఘమిత్ర పాత్ర కోసం శృతి హాసన్ ను తీసుకోవడం.. ఆమె కొన్ని నెలల పాటు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మూవీ నుంచి తప్పుకోవడం జరిగాయి. దీంతో ఈ పాత్రలో వేరే భామను తీసుకుంటారనే ప్రచారం జరిగింది కానీ.. ఎవరూ సెట్ కాలేదు. అనేక మంది హీరోయిన్స్ తర్వాత.. చివరకు ఇప్పుడు దిశా పాట్నీ పేరు ప్రముఖ్ంగా వినిపిస్తోంది. ఇప్పుడు సంఘమిత్ర ఆగిపోయిందనే ప్రచారంపై మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి మరీ స్పందించాడు దర్శకుడు సుందర్. తాము సంఘమిత్ర ప్రాజెక్టును ఆపేసే ప్రసక్తే లేదని అంటున్నాడు ఈ డైరెక్టర్.

ఈ స్కిప్ట్ కోసం 18 నెలలు తపించామని.. స్టోరీ బోర్డ్ ప్రిపేర్ చేస్తున్నామని అన్న దర్శకుడు. గ్రాఫిక్ వర్క్ అవసరం కూడా ఈ చిత్రానికి చాలానే ఉంటుందని అంటున్నాడు. ప్రీ ప్రొడక్షన్ కోసం ఎక్కువగా సమయం పడుతోందని చెబుతున్న సుందర్.. ఈ ఏడాది ఏప్రిల్ మే నెలల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు చెప్పాడు. అసలు సింగిల్ ఫ్రేమ్ షూటింగ్ కూడా జరగకుండానే.. గ్రాఫిక్ వర్క్ ఏంటో అంటూ సంఘమిత్ర మీద కొన్ని జోకులు కూడా పేలుతున్నాయ్.