Begin typing your search above and press return to search.
అది చరణ్ కి మాత్రమే సాధ్యం .. మరొకరి వల్ల కాదు!
By: Tupaki Desk | 23 Jan 2022 1:45 PM GMTటాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో సురేందర్ రెడ్డి ఒకరుగా కనిపిస్తాడు. ఇటు హీరోయిజాన్ని .. అటు విలనిజాన్ని స్టైలీష్ గా చూపించడం సురేందర్ రెడ్డి ప్రత్యేకత. అలాగే అప్పటివరకూ కనిపించని ఒక డిఫరెంట్ లుక్ తో ఆయన హీరోలను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తాడు. కథాకథనాల సంగతి అలా ఉంచితే, హీరోలను తెరపై ఆవిష్కరించే తీరులో ఆయన ఎప్పుడూ కూడా ఫెయిల్ కాలేదు. ఇక ఆయన ఒక సినిమాను ఎక్కడ ఎంతమాత్రం బోర్ కొట్టకుండా ఎలా నడిపిస్తాడనడానికి నిదర్శనంగా 'కిక్' .. 'రేసు గుర్రం' .. 'ధ్రువ' వంటి సినిమాలు కనిపిస్తాయి.
'ధృవ' సినిమా సమయం నుంచి కూడా చరణ్ కి .. సురేందర్ రెడ్డికి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ స్నేహం కారణంగానే 'సైరా' సినిమా సురేందర్ రెడ్డి చేతికి వచ్చింది. చిరంజీవి కథానాయకుడిగా అత్యంత భారీ బడ్జెట్ తో చరణ్ ఈ సినిమాను నిర్మించాడు. చారిత్రక నేపథ్యంలో నిర్మితమైన ఈ సినిమా 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ స్థాయిలో ఈ సినిమాను తెరపై ఆవిష్కరించడంలో సురేందర్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. అయితే కొన్ని లోపాల కారణంగా ఈ సినిమా ఆశించిన స్థాయి రికార్డులను అందుకోలేకపోయింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సంగతులను సురేందర్ రెడ్డి ప్రస్తావించాడు. 'సైరా'కి సంబధించిన కొన్ని సన్నివేశాలను 'బల్గెరియా'లో చిత్రీకరించాము. సాధారణంగా సినిమాల కోసం కొన్ని ఎకరాల్లో సెట్స్ వేయడం జరుగుతూ ఉంటుంది. కానీ 'సైరా' సినిమాకి పనిచేసేవారి కోసం అక్కడ 5 ఎకరాల్లో ఒక చిన్నపాటి సిటీని రెడీ చేయడం జరిగింది. మామూలుగా ఎక్కడైనా వర్షం వస్తే షూటింగ్ చేయడం కష్టమవుతూ ఉంటుంది. అలాంటిది అక్కడి గాలి కారణంగా షూటింగును ఆపుకోవలసి వచ్చేది.
ఆ ప్రాంతమంతా కూడా ఒక ఎడారిలా ఉంటుంది. అంతమంది ఆర్టిస్టులను .. టెక్నీషియన్స్ ను ఎక్కడ ఉంచుతాము? అప్పుడు చరణ్ గారు 5 ఎకరాల్లో ఒక చిన్నపాటి సిటీని ఏర్పాటు చేయమని చెప్పారు. ప్రతి ఒక్కరికీ ఒక బాత్ రూమ్ .. ఒక బెడ్ రూమ్ వచ్చేలా రూమ్స్ ఏర్పాటు చేయించారు. ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదు .. అందరూ కంఫర్ట్ బుల్ గా ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన అలా చేశారు. ఎక్కడికక్కడ ఆర్మీ తరహా టెంట్లు వేయించారు. అందరూ భోజనాలు చేయడానికి ఒక డైనింగ్ హాల్ ను సెట్ చేయించారు. కేవలం ఆ ఒక్క సెటప్ కోసం 50 లక్షల వరకు ఖర్చు చేశారు. ఇక 200 గుర్రాల కోసం ప్రత్యేకంగా ఒక షెడ్టు వేయించారు. అంత కేర్ తీసుకోవడం .. అంత ఖర్చు చేయడం ఒక్క చరణ్ వలన మాత్రమే అవుతుంది. అది మరొకరి సాధ్యం కాదు" అని చెప్పుకొచ్చాడు.