Begin typing your search above and press return to search.
సీత కథలో అంత సీక్రెట్ ఉందా?
By: Tupaki Desk | 13 May 2019 5:27 AM GMTకాజల్ .. బెల్లంకొండ శ్రీనివాస్ జంటగా తేజ దర్శకత్వంలో సీత తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే సీత టీజర్ రిలీజై ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అసలింతకీ ఈ సినిమా కథాంశం ఏంటి? కాంట్రాక్ట్ మ్యారేజెస్ బ్యాక్ డ్రాప్ సినిమానా? కాజల్ తోనే చేయడానికి కారణమేంటి? బెల్లంకొండ ఎందుకు అంగీకరించారు? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ దర్శకుడు తేజ స్వయంగా సమాధానం ఇచ్చారు.
ప్రేమకథా చిత్రాలు .. రాజకీయ నేపథ్యంలో సినిమాలు తీశారు. ఇప్పుడు సీత అంటూ ఎగ్రెస్సివ్ లేడీని చూపిస్తున్నారు అన్న ప్రశ్నకు తేజ చెప్పిన ఆన్సర్ ఆసక్తికరం. నేను ఫెమినిస్టుని. ఫెమినిజం.. స్త్రీ స్వేచ్ఛకు సపోర్ట్ చేస్తాను. నా అన్ని సినిమాలు అమ్మాయిలు ఇష్టమని అంటారు అందుకే అని తెలిపారు. జయం.. నిజం... నేనే రాజు నేనే మంత్రి.. సీత అన్నిట్లో నాయికా ప్రధాన్యత ఎక్కువ. ఇతర సినిమాల్లో చెట్టు పుట్ట అంటూ నాయికలు పాటలు పాడుకుంటారు. కానీ నా సినిమాల్లో అలా కాదు. సీత్ టైటిల్ అమ్మాయిపై ఎంచుకున్నది. సినిమా కాజల్ పైనే రన్ అవుతుంది. కాజల్ నే ఎందుకు ఎంచుకున్నారు? అన్న ప్రశ్నకు.. కాజల్ తో లక్ష్మీ కళ్యాణం తర్వాత ఈ సినిమా చేశాను. తన ఆసక్తి వల్లనేనని తెలిపారు. అమ్మాయిపై సాగే సినిమా ఇది. కాజల్ కథ విన్నది. కథ విని నేనే చేయాలి .. ఎన్ని కాల్షీట్లు కావాలన్నా ఇస్తాను అంటూ అడిగింది. అలా కాజల్ ని ఎంపిక చేసుకున్నా.. అని తెలిపారు.
హీరోని ఎలా ఫిక్స్ చేశారు? అన్న ప్రశ్నకు.. పలువురు హీరోలతో మాట్లాడాక బెల్లంకొండ ఓకే అయ్యాడు . కాజల్ ప్రధాన పాత్రధారి అయినా నేను చేస్తామని అన్నాడు అని తెలిపారు. సీత కాంట్రాక్ట్ మ్యారేజెస్ లైన్ తీస్కున్నారా? అంటే కాదని అన్నారు తేజ. ట్రైలర్ చూస్తే అలా అనిపించినా ఆ కథ కాదని తెలిపారు. సీత ప్రస్తుత సన్నివేశానికి తగ్గ సినిమానా? సందేశం ఇస్తున్నారా? అంటే సందేశం అస్సలు ఇవ్వను. మహేష్ తో `నిజం` లో సందేశం ఇచ్చాను.. చేతులు కాళ్లు కాలాయి. అందుకే ఇక ఎప్పటికీ ఇవ్వను అని తెలిపారు. ఇక `సీత` చిత్రం వాల్మీకి రామాయణమా? తేజ రామాయణమా? అని ప్రశ్నిస్తే `నేటి రామాయణం` ఇది అని అన్నారు. సీత అగ్రెస్సివ్ గా ఉంటే ఎలా ఉంటుంది అనేదే నా కథ. అమ్మాయిలు అగ్రెస్సివ్ గా ఉండాలి అని భావిస్తాను. అదే తెరపై చూపించాను అన్నారు. సీత అగ్రెస్సివ్ గా ఉంటే ఎలా ఉంటుంది? అన్నదే నా సినిమా... అని తెలిపారు.