Begin typing your search above and press return to search.

మళ్లీ రాజుతోనే తేజ!!

By:  Tupaki Desk   |   23 April 2018 7:36 AM GMT
మళ్లీ రాజుతోనే తేజ!!
X
సీనియర్ దర్శకుడు.. ఒకనాటి ట్రెండ్ సెట్టర్ అయిన తేజ పై దాదాపుగా అందరూ నమ్మకాలు పూర్తిగా కోల్పోయిన పరిస్థితి నుంచి.. ఇప్పుడు పొలిటికల్ యాంగిల్ లో మూవీ అనగానే మొదటగా తన పేరే గుర్తొచ్చే రేంజ్ కు చేరుకున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ అంటూ బాలయ్య చేస్తున్న బయోపిక్ కి కూడా తేజనే దర్శకుడు.

తేజ బౌన్స్ బ్యాక్ అవడానికి కారణం నేనే రాజు నేనే మంత్రి అంటూ తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్. ఈ మూవీ ద్వారా రానా కూడా సోలో హీరోగా సత్తా చాటాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ ఇప్పుడు మళ్లీ రిపీట్ కాబోతోందని తెలుస్తోంది. వెంకీతో తేజ ప్రాజెక్టు ఆగిపోయిన దశలో.. ఇప్పుడు మరో దగ్గుబాటి హీరోతో సినిమాకు రెడీ అవుతున్నాడు తేజ. ఈ సారి దేశభక్తి థీమ్ తో మూవీ చేయనున్నారట. అయితే.. ఇది పీరియాడిక్ ఫిలిం కావడం విశేషం. 1971లో జరిగిన ఇండియా-పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంతో ఈ మూవీ సాగనుందని తెలుస్తోంది.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ కు చెందిన పైలట్ పాత్రలో రానా కనిపిస్తాటడ. ముంబైకు చెందిన ఓ కార్పొరేట్ కంపెనీ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మరోవైపు ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కు కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని అంటున్నారు. గ్రాఫిక్ డిజైనింగ్ కోసం ఇప్పటికే ఓ హాలీవుడ్ కంపెనీకి పిలుపును పంపారట కూడా. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వెలువడనుండగా.. ఎన్టీఆర్ చిత్రాన్ని తేజ పూర్తి చేసిన వెంటనే.. రానాతో సినిమా స్టార్ట్ కానుంది.