Begin typing your search above and press return to search.
మహేష్ లేకుండా నిజం సీక్వెల్
By: Tupaki Desk | 10 Aug 2017 1:12 PM GMTఅప్పట్లో 'నిజం' సినిమా కమర్షియల్ రిజల్టుతో నిరాశనే మిగిల్చింది. కాని ఆ సినిమాను తీసిన దర్శకుడు తేజ.. చేసిన మహేష్ బాబుకు ఎంతో పేరును తెచ్చిపెట్టింది కూడా. ఇద్దరికీ కొన్ని అవార్డులు కూడా వచ్చాయి. అయితే ఆ సినిమా ఫెయిల్యూర్ తరువాత మహేష్ ప్రయోగాలను చేయకూడదని ఫిక్సవ్వగా.. తేజ మాత్రం పెద్ద స్టార్లతో సినిమాలు చేయకూడదని డిసైడ్ చేసుకున్నాడు. కాని ఇప్పుడు ఆ నిజానికి ఒక సీక్వెల్ వస్తే?
నిజానికి 'నిజం' సినిమాకు సీక్వెల్ చేయాలని తేజ ఎప్పటినుండో ఆలోచిస్తున్నాడట. ఇది సీక్వెల్ కథ అయినా కాకపోయినా.. ''ఇది నిజం కాదు'' అంటూ మనోడు ఒక సీక్వెల్ సినిమాను చేయాలని కథను సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో నిజం సినిమా అందరికీ నచ్చింది మహేష్ ఉండడం వలన కాదు కాని.. కంటెంట్ వలనే.. అంటున్నాడు తేజ. అందుకే మనోడు ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్లో కూడా మహేష్ ను లేదా మహేష్ అంతటి పెద్ద స్టార్ ను కాకుండా.. ఒక సింపుల్ హీరోను తీసుకుని ఫినిష్ చేస్తాడట. కావాలంటే కొత్తాళ్లతో తీస్తాడట.
తేజ సినిమా కాబట్టి తేజ ఇష్టం.. నిజం అవునని తీస్తాడో నిజం కాదని తీస్తాడో. కాకపోతే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే.. పెద్ద పెద్ద డైరక్టర్లే తమ సినిమాలకు తాము సీక్వెళ్లు తీసి చేతులు కాల్చుకున్నారు. లేడీస్ టైలర్ సీక్వెల్ గా వచ్చిన ఫ్యాషన్ డిజైనర్ అయితేనేమి.. ఆర్య సినమాకు సీక్వెల్ గా వచ్చిన ఆర్య 2 అయితేనేమి.. కమర్షియల్ గా అభిమానులను డిజప్పాయింట్ చేశాయి. స్టార్ వాల్యూ ఉంది కాబట్టి ఆర్య 2 ఆడేసింది.. ఫ్యాషన్ డిజైనర్ బొబ్బుంది. మరి తేజ ఈ విషయాన్ని సరిచూసుకుంటే బెటర్.