Begin typing your search above and press return to search.
యన్.టి.ఆర్.. సంక్రాంతికి కాదు దసరాకే
By: Tupaki Desk | 29 March 2018 7:32 AM GMTతెలుగు ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున బయోపిక్ శ్రీకారం చుట్టుకుంది. విశ్వవిఖ్యాత నటుడు.. రాజకీయ ఉద్ధండుడు నందమూరి తారకరామారావు జీవిత కథతో ఆయన తనయుడు బాలయ్య.. సీనియర్ దర్శకుడు తేజ కలిసి చేస్తున్న ‘యన్.టి.ఆర్’ ప్రారంభోత్సవం’ ఈ రోజు రామకృష్ణ స్టూడియోస్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు తేజ పెద్ద షాకే ఇచ్చాడు. అందరూ అనుకుంటున్నట్లుగా ‘యన్.టి.ఆర్’ రిలీజయ్యేది సంక్రాంతికి కాదట. ఈ ఏడాది దసరాకే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారట. స్వయంగా తేజనే ఈ విషయాన్ని వెల్లడించాడు.
ఆరు సినిమాల కథను ఒక సినిమాలో చూపిస్తున్నామని.. ఇది చాలా శ్రమతో కూడుకున్న విషయమని.. ఇందుకు సమయం పడుతుందని అంటూనే ఆరు నెలల్లో రాబోయే దసరా పండక్కి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని తేజ చెప్పడం విడ్డూరమే. వేరే పనేమీ పెట్టుకోకుండా ఈ సినిమా తీస్తూ పోతేనే దసరా రిలీజ్ అందుకోవడం కష్టం. అలాంటిది ఓవైపు వెంకటేష్ సినిమాను మొదలు పెట్టి.. ఇంకో నెలా రెండు నెలలు దాని మీదే పని చేసి.. ఆ తర్వాత బయోపిక్ పని చేపట్టి దసరా సమయానికి సినిమాను రెడీ చేయడం అంటే అసాధ్యమైన విషయమే. మరి తేజ ఎలా దసరా రిలీజ్ అని చెప్పగలిగాడో? అయినా సంక్రాంతి బాలయ్యకు సెంటిమెంటు అయినప్పుడు.. సినిమా తీయడానికి సమయం కూడా పట్టేలా ఉంది కాబట్టి ఆ తేదీనే ఖరారు చేసుకోకుండా దసరా మీద ఎందుకు దృష్టి పెట్టినట్లో? ఐతే సినిమా ఆలస్యమై ఆటోమేటిగ్గా సంక్రాంతి మీదే ఫోకస్ చేస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇండస్ట్రీలో.