Begin typing your search above and press return to search.
యాపిల్ కంపెనీ పెట్టుకోమంటున్న తేజ
By: Tupaki Desk | 8 Aug 2017 1:13 PM GMT''ఒకవేళ నిజంగానే సినిమా చూస్తూ ఉండగానే.. ఆ సినిమాపై నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ.. దానిని ఎనాలసిస్ చేసే అంత సత్తా ఉంటే కనుక.. రివ్యూ రైటర్లందరూ ఒక యాపిల్ వంటి కంపెనీ పెట్టొచ్చుగా??'' అంటూ చురకలు వేస్తున్నాడు దర్శకుడు తేజ. ఎప్పటికప్పుడు తన ఒపీనియన్ ఫ్రాంక్ గా చెప్పడంలో తేజ పెద్దగా సంకోచించడని ఇండస్ర్టీలో ప్రసిద్ది. ఇప్పుడు 'నేనే రాజు నేను మంత్రి' సినిమా రిలీజ్ అవుతున్న తరుణంలో.. మనోడు రిలీజ్ కాకముందే అప్పుడే రివ్యూలపై ఒపీనియన్ చెప్పమంటే.. ఇలా తనదైన స్థాయిలో స్పందిస్తున్నాడు.
''అసలు ఒకేసారి సినిమా చూస్తూ దాని గురించి నోట్స్ రాసుకుంటూ దానిని విశ్లేషణ చేయాలంటే.. ఖచ్చితంగా ఆ రివ్యూ రైటర్ల ఐ.క్యూ. అనేది 200 పైగా ఉండాలి. అలా ఉంటే కనుక వారు యాపిల్ వంటి కంపెనీలను పెట్టేసి పెద్ద పెద్ద సాఫ్టువేర్లు కనిపెట్టొచ్చుగా. రివ్యూలు ఎందుకు రాయడం??'' అంటూ సెటైరికల్ గా పంచ్ వేశాడు తేజ. తాను ఏదో కేవలం కొన్ని మంచి మంచి రివ్యూలను చదవడం తప్పించి.. అసలు రివ్యూలను పెద్దగా పట్టించుకోనని కామెంట్ చేశాడు. మరి తేజ పాయింటాఫ్ వ్యూ తేజకు ఉన్నట్లే.. రివ్యూ రైటర్లకు కూడా వారి పాయింటాఫ్ వ్యూ ఉంటుందిగా? ఐక్యూ (ఇంటెలిజెంట్ కోషెంట్.. తెలివేతేటల స్థాయి) 200 పైగా ఉంటేనే రివ్యూ రాయాలని అని సూచిస్తున్నారంటే.. ఐక్యూ 200 పైగా ఉన్నోళ్ళే సినిమాలు తీస్తున్నారా తేజ సారూ?
ఏదేమైనా కూడా రానా యాంకర్లపై అరవడం.. తేజ రివ్యూ రైటర్లపై విరుచుకుపడటం.. అన్నీ కూడా ''నేనే రాజు నేనే మంత్రి'' సినిమాకు నెగెటివ్ ప్రచారం చేస్తున్నాయి. ఎందుకంటే వీరిలా నెగెటివ్ ఎలిమెంట్స్ ను వాడి ప్రచారం చేయడం చూస్తుంటే.. సినిమాలో సరుకు లేదేమోనని సామాన్య ప్రజలకు సందేహాలు వస్తున్నాయి. లెటజ్ సీ సినిమా ఏమవుతుందో!!