Begin typing your search above and press return to search.

తేజ.. ఒకేసారి రెండు ఫీట్లు ఎందుకులే

By:  Tupaki Desk   |   20 Oct 2017 3:30 PM GMT
తేజ.. ఒకేసారి రెండు ఫీట్లు ఎందుకులే
X
'నేనే రాజు నేనే మంత్రి' సినిమా ఇచ్చిన కిక్ తో మంచి ఊపుమీదున్నాడు దర్శకుడు తేజ. ఆ సినిమాకు ముందు దాదాపు అన్నీ ఫ్లాపులే ఉన్నాయి. కాని సడన్ గా ఈ సినిమా హిట్టవ్వడంతో తేజకు డిమాండ్ పెరిగిపోయింది. ఆ ఊపులో ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలను చేస్తున్నట్లు ప్రకటించాడు.

అప్పట్లో విక్టరీ వెంకటేష్‌ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తో కలసి ఉన్నప్పుడు దిగిన ఫోటో ఒకటి పోస్ట్ చేసి.. వీరిద్దరి సినిమాలు చేస్తున్నట్లు చెప్పాడు. త్వరలోనే రెండింటి క్యాస్టింగ్ పని మొదలవుతుందని.. అలాగే మిగతా వివరాలు కూడా చెప్తానని ప్రకటించేశాడు తేజ. బాగానే ఉంది. ఒక ప్రక్కన సురేష్‌ బాబు ప్రొడక్షన్లో వెంకటేష్‌ హీరోగా సినిమా.. మరో ప్రక్కన బాలయ్య హీరోగా ఎన్టీఆర్ బయోపిక్.. ఈ రెండూ చేస్తున్నాడనమాట. కాని ఒకేసారి రెండు ప్రాజెక్టులంటే ఎలా హ్యాండిల్ చేస్తారు తేజ సార్‌? ఇప్పుడు జనాలకు వస్తున్న సందేహం ఇదే.

మొన్నంటే హిట్టొచ్చింది కాని.. అందుకుని చెప్పి ఒకేసారి రెండు సినిమాలు తీసేస్తానంటే ఎలా? పైగా ఎన్టీఆర్ బయోపిక్ అంటే కాస్త జాగ్రత్తగానే చేయాలి. పైగా అలనాటి పరిస్థితులను తలపించేలా సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కూడా వాడాలి. వాటిపై తనకు పెద్దగా అవగాహన లేదని కూడా ఆ మధ్యన చెప్పాడు. అలాంటప్పుడు ముందు ఏదో ఒక సినిమాను పూర్తి చేసి తరువాత ఇంకోటి చేస్తే బెటర్ కాని.. రెండూ ఒకేసారి చేస్తుంటే మాత్రం క్వాలిటీ మీద డౌట్లు వస్తాయి తేజ. కాదంటారా?