Begin typing your search above and press return to search.

నేను సేఫ్ అంటున్న దర్శకుడు

By:  Tupaki Desk   |   27 Feb 2019 5:58 AM GMT
నేను సేఫ్ అంటున్న దర్శకుడు
X
ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాల పూర్తి రిజల్ట్స్ వచ్చేసాయి. కథానాయకుడు పోయింది అనుకుంటే మహానాయకుడుతో పోలిస్తే అదే నయం అనిపించేంత దారుణమైన వసూళ్ళతో సీక్వెల్ చేతులెత్తేసింది. బాలయ్య దీని వల్ల ఎంత మనస్తాపం చెందాడో మొన్న జరిగిన 118 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముభావంగా ఉన్నప్పుడే అర్థమైపోయింది. పైగా తన సినిమా ప్రస్తావన రాకుండా ఉండేందుకు బాలకృష్ణ చాలానే కష్టపడాల్సి వచ్చింది. ఇక దర్శకుడు క్రిష్ సంగతి సరేసరి. చెప్పుకుంటే తరిగే బాధ కాదు ఆయనది.

ఇదిలా ఉంచితే ఎన్టీఆర్ బయోపిక్ కోసం ముందు ఫిక్స్ చేసుకుని తర్వాత తప్పుకున్న దర్శకుడు తేజ మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్. ఒకవేళ ఇది కనక బ్లాక్ బస్టర్ అయ్యుంటే చూసారా తేజ తన పొగరుతో బంగారం లాంటి అవకాశాన్ని తలదన్నుకున్నాడు తగిన శాస్తే జరిగింది అంటూ రకరకాలుగా కామెంట్లతో దాడి చేసేవాళ్ళు. ఇప్పుడు దానికి ఒక్క శాతం కూడా ఛాన్స్ లేదు. పైపెచ్చు ఇది మిస్ అయినందుకు తేజ అదృష్టవంతుడు అంటూ సోషల్ మీడియాలో కాంప్లిమెంట్స్ కూడా అందుతున్నాయి.

తేజకు బాలయ్యకు మధ్య స్క్రిప్ట్ విషయంలో అండర్ స్టాండింగ్ రానందువల్లే అంత ఆర్భాటంగా ఓపెనింగ్ చేసిన ఎన్టీఆర్ బయోపిక్ కు దర్శకుడిని మార్చారని లేకపోతే ఒకే భాగంగా ముందు రాసుకున్న స్క్రిప్ట్ కి కట్టుబడి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదని దగ్గరుండి ఈ పరిణామాలు గమనించిన ఆ టీం సభ్యుల మాట. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో సీత ఫినిషింగ్ లో బిజీగా ఉన్న తేజ మహానాయకుడు ఫలితం వచ్చాక తన స్నేహితులతో ఈ కోణంలోనే చర్చలు జరిపి తన ఆనందాన్ని పంచుకున్నట్టు వినికిడి. నిజమేగా. లేకపోతే ఇప్పుడు క్రిష్ అనుభవిస్తున్న సంకట స్థితి తేజకు వచ్చుండేది