Begin typing your search above and press return to search.

మరో బడా నిర్మాత హీరో వస్తున్నాడు

By:  Tupaki Desk   |   15 Jun 2018 3:45 PM IST
మరో బడా నిర్మాత హీరో వస్తున్నాడు
X
వారసత్వ హీరోలు ఈ మధ్య కాలంలో ఎక్కువవుతున్నారు. సినిమా ప్రపంచంలో కాస్త క్లిక్ అయినా కూడా కోట్లు వచ్చి పడతాయి. ఇష్టమైన పని చేసుకుంటూ కష్టం లేకుండా స్టైలిష్ లైఫ్ ను ఎంజాయ్ చేయవచ్చు. ప్రస్తుతం ప్రతి సినిమా ఇండస్ట్రీలో హీరోల కొడుకులు మనవాళ్లు నాలుగవ జనరేషన్ వరకు ఉన్నారు. ఇక నిర్మాతల కొడుకులు కూడా బాగానే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అలా వచ్చిన వారిలో కొంత మంది ఫెయిల్ అయ్యారు.

బడా బడా ప్రొడ్యూసర్స్ కొడుకులు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్నారు. ఇకపోతే మరో బడా నిర్మాత కుమారుడు కూడా త్వరలోనఁజే తెరగ్రేటం చేస్తాడని తెలుస్తోంది. ఆ విషయంలోకి వెళితే. డివివి.దానయ్య ఇప్పుడు ఏ రేంజ్ లో సినిమాలను నిర్మిస్తున్నారో తెలిసిందే. రీసెంట్ గా భరత్ అనే నేను సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. అయితే అయన కుమారుడు ప్రస్తుతం నటనలో శిక్షణ తీసుకుంటున్నడని తెలుస్తోంది. అలాగే డ్యాన్సులపై కూడా దృష్టి పెట్టారట.

కొన్ని నెలల్లో ఫిట్ అయినా తరువాత డివివి వారసుడు తేజ దర్శకత్వంలో ఇండస్ట్రీకి పరిచయం అవుతాడని టాక్ వస్తోంది. తేజ లాంటి టాలెంటెడ్ దర్శకుల చేతిలో పడితే మొదటి సినిమాలోనే కుర్ర హీరోలురాటు దేలుతారని ఒక మంచి టాక్ ఉంది. నితిన్ గోపీచంద్ లాంటి నటులకు లైఫ్ ఇచ్చి ఊహించని నటనను రాబట్టారు. అందుకే ఆయన చేతిలోనే డివివి దానయ్య తన కుమారుడి కెరీర్ ను ఉంచినట్లు సమాచారం. ఇక ఆ సినిమా ఏ స్థాయిలో నిర్మిస్తారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.