Begin typing your search above and press return to search.
అడ్వాన్సులతో తేజ వెంట పడుతున్నారట
By: Tupaki Desk | 9 Aug 2017 10:59 AM GMTదర్శకుడు తేజ హిట్టు కొట్టి దశాబ్దంన్నర దాటిపోయింది. ‘జయం’ తర్వాత తాను తీసిన ప్రతి సినిమా గురించి గొప్పగా చెప్పుకున్నాడు తేజ. కానీ ఆయన మాటలకు.. సినిమాలో విషయానికి పొంతన లేకపోయింది. తేజ చివరిగా తీసిన ‘హోరాహోరి’ గురించి కూడా ఆడియో వేడుకలో ఎలా గొప్పలు పోయాడో.. ఆ సందర్భంగా తెలుగులో వస్తున్న మిగతా సినిమాల గురించి ఎంత తేలిక చేసి మాట్లాడాడో గుర్తుండే ఉంటుంది. ఐతే తన కొత్త సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’ విషయంలో మాత్రం మొదట్నుంచి కొంచెం కామ్ గానే ఉంటున్నాడు తేజ. కానీ సినిమా విడుదల దగ్గరపడే సమయానికి తేజ స్వరం మారుతోంది. ఎప్పట్లాగే తన ఆరోగెన్స్ చూపిస్తూ ఇండస్ట్రీ జనాలపై పంచులేశాడు తేజ.
ఈ సినిమా టీజర్ రిలీజవ్వక ముందు వరకు తనను చూసి ఇండస్ట్రీ జనాలు ముఖం తిప్పుకుని వెళ్లేవాళ్లట. కానీ టీజర్ రిలీజై సినిమాకు క్రేజ్ వచ్చాక మాత్రం జేబుల్లోంచి చేతులు తీసి ‘కంగ్రాట్స్’ చెబుతున్నారని తేజ చెప్పాడు. అలాగే తమకు సినిమాలు తీసి పెట్టాలని సూట్ కేసులతో వచ్చి తన వెంటపడుతున్నట్లు తేజ చెప్పాడు. ఐతే కేవలం ప్రోమోలు చూసే తేజ కోసం ఇంతలా జనాలు వెంటపడిపోతున్నారంటే మాత్రం నమ్మశక్యంగా అనిపించడం లేదు.
మరోవైపు రాజకీయ నాయకులనైనా నమ్మొచ్చు కానీ.. ఇండస్ట్రీ వాళ్లను మాత్రం నమ్మలేమని తేజ అన్నాడు. సినిమా హిట్టయితే కంగ్రాట్స్ అంటారని.. కానీ సినిమా తేడా కొడితే మార్నింగ్ షో అవ్వగానే మనల్ని చూసే లుక్కే మారిపోతుందని తేజ చెప్పాడు. ఐతే రెండంకెల సంఖ్యలో ఫ్లాపులు తీసి.. తనను నమ్మిన చాలామంది నిర్మాతలకు నష్టాలు మిగిల్చడమే కాక.. ప్రేక్షకుల్ని కూడా నిరాశ పరిచిన తేజ.. ఫెయిల్యూర్లతో సంబంధం లేకుండా తనను ట్రీట్ చేయాలని ఆశించడం కరెక్టేనా అన్నది ప్రశ్న. సినీ పరిశ్రమ అనే కాదు.. ఏ రంగమైనా సరే.. ఎవరైనా సక్సెస్ వెంటే పరుగులు పెడతారన్నది అందరూ అంగీకరించాల్సిన వాస్తవం. ఈ సంగతి తేజకు తెలియనిదా?