Begin typing your search above and press return to search.
అలా ప్రిపేర్ అయ్యి వచ్చావా తేజా?
By: Tupaki Desk | 3 Aug 2017 7:19 AM GMTఈసారి తాను తీసే సినిమా తప్పించి తాను మాత్రం ఏమీ మాట్లాడకూడదని అనుకున్నట్లున్నాడు తేజ. ''నేనే రాజు నేనే మంత్రి'' సినిమాతో వస్తున్న తేజ ఇప్పుడు ఆ సినిమాతో పెద్దహిట్టునే కొట్టాలని ఆశిస్తున్నాడు. ఎందుకోగాని ఈ సినిమా రిజల్ట్ గురించి కాస్త టెన్షనే పడుతున్నాడు. ఎప్పుడూ కూడా తన సినిమాల ప్రమోషన్లో పెద్దగా జంకని తేజ.. ఈసారి మాత్రం కాస్త సైలెంట్ గా ఉండటానికి మక్కువ చూపిస్తున్నాడు.
అదిగో నిన్న నేనే రాజు నేనే మంత్రి ఈవెంట్లో మనోడు మెడకి ఒక పట్టి పెట్టుకుని అస్సలు మాట్లాడలేదు. చివరకు రానా కష్టపడి ఒప్పిస్తే పట్టీ తీసి నాలుగు మాటలు చెప్పాడు. ఈ సినిమా కథను రానా కాజల్ క్యాథీరన్ చెప్పిన వెంటనే ఓకె అన్నారని.. షూటింగ్ హాలిడేలా జరిగిందని.. తాను చెప్పనని.. కాకపోతే సినిమాను బాగా తీశాం అన్నాడు. అంతే కాదు..ఆగస్టు 11న మూడు సినిమాలు వస్తున్నాయి కదా.. మరి నేనే రాజు నేనే మంత్రి సినిమాను చూడాలంటారా అంటే.. వచ్చిన అన్ని సినిమాల్లో ఏది బాగుంటే అది చూడండి అనేశాడు. ఇదే తేజ మార్క్ పంచ్ అంటే. కాని మాట్లాడకుండా ఉందాం అని వచ్చిన తేజ ఇలా నాలుగు మాటలు చెప్పినా కూడా.. అసలు ఎందుకు సైలెంట్ గా ఉండిపోదాం అనుకున్నాడు అనేదే కలవరపెడుతోంది.
నిజానికి ఈ కథను చేయడానికి రెండు కారణాలు.. అందులో ఏంటంటే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ అండ్ ఎంజీఆర్ వంటి నాయకుల ఫిలాసఫీలు ఉంటాయట. ఈ విషయం రానా చెప్పాడు. మరి తేజ అంతబాగా ఈ సినిమాను రాశాడని తీశాడనే అనుకుందాం.