Begin typing your search above and press return to search.
సురేష్ బాబు అక్కర్లేదని రానాకు తేజా చెప్పారట
By: Tupaki Desk | 13 Aug 2017 12:39 PM GMTటాలీవుడ్ లో దర్శకులకు కొదవ లేదు. కానీ.. తేజ లాంటి దర్శకుడు చాలా భిన్నం. ఆయన నోరు విప్పితే నిజాల్ని నిర్మోహమాటంగా మాట్లాడేస్తారు. లోపల ఒకటి.. బయట ఒకటి అన్నది ఆయన హిస్టరీలో ఉన్నట్లుగా అనిపించదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే తేజ లాంటి వాళ్లు సినిమా ఇండస్ట్రీకి సూట్ కారంటుంటారు.అయితే.. తన చేతిలో సినిమాలు ఉన్నా లేకున్నా ఒకేలా తీరులో వ్యవహరించే దర్శకుడు తేజ తాజాగా వార్తల్లోకి వచ్చారు.
రానా.. కాజల్ అగర్వాల్ తో ఆయన తీసిన నేనే రాజు నేను మంత్రి సినిమాకు మిశ్రమ స్పందన రావటం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన విశేషాల్ని పంచుకునే సమయంలో మీడియా ప్రతినిధులకు షాకింగ్ మాట ఒకటి చెప్పారు. ఈ కథను రానాకు చెప్పినప్పుడు ఎప్పటి నుంచి చేద్దామని అడిగారట. ఆ తర్వాత రానా తండ్రి ప్రముఖ నిర్మాత సురేష్ బాబును కలిసినప్పుడు స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు సూచించారట. దీంతో కోపం వచ్చిన తేజ.. రానా దగ్గరకు వెళ్లి సురేష్ బాబు నిర్మాతగా అక్కర్లేదని.. వేరే నిర్మాతలు ఉన్నారని చెప్పారట.
అనంతరం తనను గెస్ట్ హౌస్ కు పిలిపించారని.. అక్కడ సురేష్ బాబు.. రానా ఉన్నారని.. ఆ సందర్భంగా జరిగిన చర్చతో తాను కొన్ని మార్పులు చేసేందుకు కన్వీన్స్ అయినట్లుగా తేజ వెల్లడించారు. ఈ సందర్భంగా తాను తన సినిమాను తనకునచ్చినట్లే తీస్తానని.. మార్పులకు తాను ఒప్పుకోనని చెప్పినట్లుగా వెల్లడించారు తేజ. ఇలా ఒకప్రముఖ నిర్మాతతో తనకు జరిగిన ప్రైవేటు విషయాల్ని తేజ మాత్రమే ఇంత ఓపెన్ గా చెప్పగలుగుతారని..ఆ గట్స్ ఆయనకు మాత్రమే ఉన్నాయన్న మాట ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో వినిపిస్తోంది. సురేష్ బాబు లాంటి అగ్రనిర్మాత గురించి అంత ఓపెన్ గా మాట్లాడటం మామూలు విషయమా ఏంది?