Begin typing your search above and press return to search.
తేజ మూడు సినిమాల పరిస్థితి ఏంటీ?
By: Tupaki Desk | 11 May 2021 3:30 PM GMTలవ్ స్టోరీ చిత్రాలతో ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసిన దర్శకుడు తేజ ఈమద్య కాలంలో ఆశించిన స్థాయిలో సక్సెస్ లను అందుకోవడంలో విఫలం అయ్యాడు. మద్యలో నేనే రాజు నేనే మంత్రితో ఒక మోస్తరు సక్సెస్ దక్కించుకున్న తేజ ఇటీవల మూడు సినిమాలను ప్రకటించి అందులో ఒక్కటి కూడా ఇప్పటి వరకు పట్టాలెక్కించలేక పోయాడు. దాదాపు రెండేళ్ల క్రితం తేజ ఒకే సారి రెండు సినిమాలను అనౌన్స్ చేశాడు. అలిమేలుమంగ వెంకటరమణ మరియు రాక్షస రాజు రావణుడు సినిమా లను గోపీచంద్ మరియు రానాలతో తేజ చేయబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. టైటిల్స్ ను అధికారికంగా ప్రకటించిన తేజ ఇప్పటి వరకు ఆ సినిమాలకు సంబంధించి ఏ మేరకు వర్క్ పూర్తి చేశాడు అనే విషయంలో క్లారిటీ లేదు.
ఆ రెండు సినిమాల విషయం జనాలు మర్చి పోతున్న సమయంలో తన దర్శకత్వంలో దాదాపు 20 ఏళ్ల క్రితం వచ్చిన 'చిత్రం' కు సెకండ్ వర్షన్ 'చిత్రం 1.1' ను చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. దాదాపుగా 50 మంది కొత్త నటీనటులను ఈ సినిమాతో పరిచయం చేయబోతున్నట్లుగా కూడా ఆయన పేర్కొన్నాడు. ఈ సినిమా లో ఎన్టీఆర్ బామ్మర్థి హీరోగా నటించే అవకాశాలు కూడా ఉన్నాయంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఈ సినిమా పై తేజ చాలా పట్టుదలతో ఉన్నట్లుగా భావిస్తున్న సమయంలో కరోనా కారణంగా నిలిచి పోయింది.
కరోనా సెకండ్ వేవ్ ఆయన ప్లాన్స్ ను పక్కన పెట్టేలా చేసింది. కొత్త వారిని ఆడిషన్స్ చేయడంతో పాటు షూటింగ్ కు కూడా వీలు పడటం లేదు. దాంతో చిత్రం 1.1 ఎప్పటికి ప్రారంభం అవుతుందో తెలియడం లేదు. కొన్నాళ్లయితే అలిమేలువెంకట రమణ మరియు రాక్షస రాజు రావణుడు చిత్రాలతో 'చిత్రం 1.1' కూడా చేరిపోతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. షూటింగ్ లు పునః ప్రారంభం అయినప్పుడు అయినా ఈ సినిమా ప్రారంభం అయ్యేనో చూడాలి.