Begin typing your search above and press return to search.

నేనే డైరెక్ట‌ర్ నేనే రైట‌ర్

By:  Tupaki Desk   |   20 Aug 2017 4:52 PM GMT
నేనే డైరెక్ట‌ర్ నేనే రైట‌ర్
X
బాహుబ‌లిలో విలన్ గా పేరు తెచ్చుకున్న త‌రువాత రానా సోలో హీరోగా యాక్ట్ చేసిన సినిమా నేనే రాజు నేనే మంత్రి. రాజ‌కీయ నేప‌థ్యంతో తెర‌కెక్కిన ఈ సినిమా నిర్మాత‌ల్ని సేవ్ చేసినా కొనుకున్న వారికి భారీ న‌ష్టాలు ఇచ్చింది అనే టాక్ బలంగా వినిపిస్తోంది.లేనిపోని హైప్ సృష్టించి అధిక ధరలకు సినిమాను అమ్మడమే కాక చేతిలో ఉన్న థియేటర్లు అన్నింటిలో విడుదల చేయడంతో స్థానికంగా ఉన్న ఎగ్జిబిటర్ల మధ్య పోటీ ఏర్పడి వసూళ్లు దేనికీ పూర్తిగా రాక అందరూ నష్టపోయినట్టు టాక్. అయితే ఇండ‌స్ట్రీలో ప్రొడ్యూస‌ర్ సేఫ్ అయితే కౌంట్ లోకి తీసుకుంటారు క‌నుక‌, ఈ సినిమాతో చాలా ఏళ్లు త‌రువాత తేజ‌కి బ్రేక్ వ‌చ్చింద‌నే ప్ర‌చారం జరుగుతుంది. దీంతో పాటే ఈ క‌థ తిమ్మారెడ్డి అనే రైట‌ర్ ద‌గ్గ‌ర నుంచి తేజ కాజేశాడ‌నే వార్త‌లు కూడా ఫిల్మ్ న‌గ‌ర్ లో బ‌లంగా వినిపించాయి.గతంలో కూడా కొన్ని స్టార్ హీరోల సినిమాల విషయంలో ఇలాగే జరిగింది తొలుత దీన్ని కొందరు లైట్ తీసుకున్నారు. హిట్ అయ్యుంది ఇలాంటివి రావడం సహజం అని కూడా కామెంట్స్ వినిపించాయి. దానికి తోడు సురేష్ బాబు లాంటి నిర్మాత ఇలాంటి అనైతిక చర్యను ప్రోత్సహించడు అనే నమ్మకంతోనే దీనికి పెద్దగా ప్రాచుర్యం లభించలేదు. కాని ఒరిజినల్ కథ నాదే అని చెబుతున్న తిమ్మారెడ్డి మాత్రం తాను చెప్పింది అక్షర సత్యమని నొక్కి చెబుతున్నాడు.

అయితే ఇదే విష‌యాన్ని కొంద‌రు తేజ‌ని స్వ‌యంగా అడిగాతే, ఆయ‌న అదేమీ లేద‌ని, తిమ్మారెడ్డికి అన్ని సెటిల్ మెంట్లు చేశాకే క‌థ అత‌ని ద‌గ్గ‌ర నుంచి తీసుకున్న‌ట్లుగా బ‌దులిచ్చాడ‌ట‌. అయితే తాజాగా తిమ్మారెడ్డి మా తుపాకి ప్ర‌తినిధిని క‌లిసినప్పుడు నేనే రాజు నేనే మంత్రి విష‌యంలో తేజ త‌న‌ను మోసం చేసిన‌ట్లుగా తెలిపాడు. క‌థ త‌న‌దే అనే విష‌యం సినిమాకి ప‌నిచేసిన కీల‌క వ్య‌క్తులు అంద‌రికి తెలుస‌ని తిమ్మారెడ్డి చెప్పారు. రైట‌ర్ గా టైటిల్ కార్డ్ వేయిస్తా అని, క‌థ‌కు మంచి పేయిమెంట్ ఇప్పిస్తా అని చెప్పిన‌ తేజ‌ - రానా - సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ వారితో డీల్ సెట్ చేసుకున్న త‌రువాత త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం మానేశాడ‌ని, ఆయన మీద నమ్మకంతో ఎదురు చూసిన తనకు ఇలా చేయటం అన్యాయమని వాపోతున్నారు. ఒక్క కథనైతే దొంగలించవచ్చు కానీ తన మెదడులో ఉన్న సృజనాత్మకతను చేయలేరని కౌంటర్ వేశారు. కానీ ఇలాంటి అన్యాయాలకు వర్ధమాన రచయితలు బలికాకుండా ఉండటం కోసమే తాను మీడియా కు బహిర్గతం చేశానని స్పష్టం చేశారు. నిన్న‌మొన్న‌టి వ‌రుకు సైలెంట్ గా ఉన్న తిమ్మారెడ్డి ఇప్పుడు స‌డెన్ గా బ‌య‌ట‌కు వ‌చ్చి మాట్లాడుతున్నాడంటే, ఇందులో ఎంతో కొంత నిజ‌మే ఉంటుంద‌ని అనిపిస్తుంది. మ‌రి నిర్భయంగా తిమ్మారెడ్డి చేస్తున్న ఆరోప‌ణ‌ల‌కు తేజ బదులిస్తాడా లేదా తన మానాన తాను సైలెంట్ గా ఉంటాడా అనేది వేచి చూడాలి. తాను ఐదు పదేళ్లు అడ్వాన్సుగా ఆలోచిస్తానని, తన సినిమాలను అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ క్రిటిక్స్ ను ఎద్దేవా చేసిన తేజ ఇప్పుడు వచ్చిన ఆరోపణలపై స్పష్టమైన ఆధారపూరిత వివరణ ఇవ్వడం నైతికత అనిపించుకుంటుంది. లేదా ఆయన సినిమా భాషలో చెప్పాలంటే "పడవ ఎక్కేవరకు కోటి లింగం, గట్టు దాటగానే బోదిలింగం" అనే సామెత వాడాల్సి వస్తుంది. చూద్దాం తేజ ఏమంటాడో.