Begin typing your search above and press return to search.
డౌట్ లేదు .. ఈ సీజన్ మాస్ మహారాజ్ దే!
By: Tupaki Desk | 10 Feb 2022 12:30 AM GMTరవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' సినిమా రూపొందింది. సత్యనారాయణ కోనేరు నిర్మించిన సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. రవితేజ సరసన నాయికలుగా మీనాక్షి చౌదరి - డింపుల్ హయతి అందాల సందడి చేశారు. ఈ సినిమాను ఈ నెల 11వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ - 'పార్క్ హయత్' హోటల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ సినిమా నటీనటులు .. సాంకేతిక నిపుణులతో పాటు కొంతమంది సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.
ఈ వేదికపై దర్శకుడు నక్కిన త్రినాథరావు మాట్లాడుతూ .. "ఇంతకుముందు మాస్ మహారాజ్ కి సంబంధించిన AV ఒక రేంజ్ లో ఉంది. అది చూస్తూ నాలో నేను విజువల్స్ వేసుకుంటున్నాను. రవితేజ గారికి గుడ్ మార్నింగ్ చెప్పాలంటేనే నాకు భయం. "అబ్బో గుడ్ మార్నింగే .. వచ్చిన పని చెప్పమ్మా .. అది గుడ్డో .. బ్యాడో నేను చెబుతాను" అంటారు. అందువలన ఆయనకి కాల్ చేసి గుడ్ మార్నింగ్ చెప్పడానికి కూడా నేను భయపడుతూ ఉంటాను. ఆయనకి డైరెక్ట్ గా మేటర్ చెప్పాలంతే. రవితేజ గారితో పనిచేయడం వలన ఆయన స్టైల్లో మాట్లాడటం నాకు అలవాటైపోయింది.
'క్రాక్' సినిమాతో హిట్ కొట్టిన రవితేజ .. మళ్లీ ఇప్పుడు 'ఖిలాడి' సినిమాతో మీ ముందుకు వస్తున్నారు. ఇది నా సినిమా టైటిల్ మాదిరిగా డబుల్ 'ధమాకా' కావాలని కోరుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో ఆయన ఎనౌన్స్ చేసిన టైటిల్స్ చూస్తే మతిపోతుంది. ఖిలాడి .. రామారావు ఆన్ డ్యూటీ .. రావణాసుర .. టైగర్ నాగేశ్వరరావు .. చివరిగా నా 'ధమాకా'. టైటిల్స్ చూస్తుంటేనే ఈ సీజన్ అంతా ఆయనదేనని అనిపిస్తోంది. రవితేజ గారిని డైరెక్ట్ చేసే అవకాశం నాకు కూడా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ అవకాశం నాకు ఇచ్చిన రవితేజ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నాను.
ఇక దేవిశ్రీ విషయానికి వస్తే .. ఆయన ప్రపంచాన్నే ఊపేస్తున్నారు. 'పుష్ప' సినిమాకి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన ఆయన, ఈ సినిమాకి కూడా గొప్ప మ్యూజిక్ ను ఇచ్చారు. ఈ సినిమాలో హీరోయిన్స్ ఇద్దరినీ లొకేషన్ లో చూశాను .. మళ్లీ చూడాలనుకునే ఇప్పుడు వచ్చాను. సినిమా చూడటానికి ఎల్లుండి థియేటర్ కి వెళతాను. కోనేరు సత్యనారాయణ గారు నాకు చాలా తక్కువ సమయంలో సన్నిహితులయ్యారు. ఎంత క్లోజ్ అయ్యామంటే ఇద్దరం కూర్చుంటే కిలో మటన్ తినేస్తున్నాము. ఆయన చాలా రంగాల్లో సక్సెస్ లు చూసి వచ్చారు. నిర్మాతగా కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చారు.