Begin typing your search above and press return to search.

ప్యాషన్ చూపిస్తున్న ఫ్యాషన్ డిజైనర్

By:  Tupaki Desk   |   23 May 2017 6:37 AM GMT
ప్యాషన్ చూపిస్తున్న ఫ్యాషన్ డిజైనర్
X
3 దశాబ్దాలకు పూర్వం వచ్చిన తన దర్శకత్వంలోనే లేడీస్ టైలర్ కు కొనసాగింపుగా ఫ్యాషన్ డిజైనర్ మూవీని తెరకెక్కించారు దర్శకుడు వంశీ. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద్రాబాద్ లో జరిగింది. హీరో సుమంత్ అశ్విన్.. హీరోయిన్స్ అనీషా ఆంబ్రోస్- మనాలీ రాథోడ్ లతో పాటు ఫ్యాషన్ డిజైనర్ యూనిట్ అంతా ఈ వేడుకకు హాజరయ్యారు.

ఫ్యాషన్ డిజైనర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వివి వినాయక్ చీఫ్ గెస్ట్ గా హాజరు కాగా.. పెళ్లి చూపులు హీరో విజయ్ దేవరకొండ కొంతసేపు ఆహుతులను అలరించాడు. లేడీస్ టైలర్ కు రైటర్ అయిన తనికెళ్ల భరణి నుంచి.. తమ్మారెడ్డి సినీ పెద్దలు అందరూ దర్శకుడు వంశీ ప్రతిభను ప్రశంసించారు. గోదారి తీరంతో వంశీకి ఉన్న అనుబంధాన్ని.. హీరోయిన్లను ఆయన ఎంత అందంగా చూపుతారనే అంశాన్ని వేనోళ్ల ప్రశంసించారు. వంశీ దర్శకత్వంలో నటించడం మొదలుపెట్టాక తాను నటనలో ఎన్నో అంశాలు నేర్చుకున్నట్లు చెప్పాడు హీరో సుమంత్ అశ్విన్. ఈ చిత్రంలో మణి శర్మ స్వరపరిచిన ఐదు పాటలు ఆకట్టుకోవడం విశేషం.

వంశీ గారి కోసమే తాను గ్లామరస్ రోల్ లో నటించానని చెప్పింది అనీషా ఆంబ్రోస్. ఈ సినిమా నటించిన తర్వాత తనకు వేరే ఆఫర్ ఏదీ రాకపోయినా పర్లేదని.. అంత మంచి సినిమాలో చేశానని మరో హీరోయిన్ మనాలీ రాథోడ్ చెప్పడం విశేషం. స్టేజ్ పైకి వచ్చిన ప్రతీ ఒక్కరికి ఏదో ఒక ఫ్యాషనబుల్ ఐటెంను అలంకరిస్తూ యాంకర్స్ చేసిన సందడి కూడా అందరినీ అలరించింది.

తను ఇప్పటివరకూ తీసిన సినిమాలు అన్నిటిలోకి ఇదే బెస్ట్ అని.. మంచి సినిమాలు తీయాలనే తన తపన.. దర్శకుడు వంశీతో తీసిన ఫ్యాషన్ డిజైనర్ తో మరింతగా పెరిగిందని అన్నారు నిర్మాత మధుర శ్రీధర్. జూన్ 2న ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ మూవీని(అన్నీ నాన్న బుద్ధులే అన్నది ట్యాగ్ లైన్) విడుదల చేయనున్నట్లు ప్రకటించింది యూనిట్.