Begin typing your search above and press return to search.
వంశీ చేతికి మంచి స్టోరీ అందిందట
By: Tupaki Desk | 7 Jun 2017 1:08 PM GMTఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ మూవీతో కొన్నేళ్ల తర్వాత ఆడియన్స్ ను పలకరించారు దర్శకుడు వంశీ. ఈ సినిమా ఆశించిన స్థాయి రిజల్ట్ అందుకోవడంలో విఫలం అయినా.. వంశీ మార్క్ మేకింగ్ స్టైల్ మాత్రం మిస్ కాలేదనే విషయాన్ని మరోసారి నిరూపించింది.
ఇప్పుడు వంశీ దర్శకత్వంలో మరో సినిమా ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఫ్యాషన్ డిజైనర్ విషయంలో అన్నీ ఉన్నా.. సరిగా లోపించిన అంశం కథే అని చెప్పాలి. స్ట్రాంగ్ గా ఉండాల్సిన స్టోరీ.. ఆ స్థాయిలో లేకపోవడం ఒక్కటే లోటు. ఆ లోటును ఈ సారి కమెడియన్ కృష్ణ భగవాన్ తీర్చేయనున్నాడట. అసలు బడ్జెట్ పరంగా పెద్దగా డిమాండ్స్ పెట్టుకోని వంశీతో సినిమా చేయడం చాలా ఈజీ అంటారు నిర్మాతలు. ఇప్పుడు వంశీ రూపొందించబోయే సినిమాకి కథ.. స్క్రీన్ ప్లే సమకూర్చాడట కృష్ణభగవాన్. ఒరిజినల్ గా రైటర్ అయిన ఈ కమెడియన్ అందించిన కథ నచ్చడంతోనే.. ఈ ప్రాజెక్టుకు బీజం పడిందని అంటున్నారు.
గతంలో మోహన్ బాబు హీరోగా రూపొందిన డిటెక్టివ్ నారద చిత్రానికి కూడా మాటలు అందించాడు కృష్ణభగవాన్. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ లో మూవీ రూపొందనుందన్న మాట. మరి ఈసారి ముందే కథను లాక్ చేసుకోవడంతో.. వంశీ నుంచి ఆడియన్స్ ఆశించే స్థాయి మూవీ వస్తుందని ఆశిద్దాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/