Begin typing your search above and press return to search.

అవును..నాకు కోపం ఎక్కువ :వంశీ

By:  Tupaki Desk   |   31 Dec 2017 11:30 AM GMT
అవును..నాకు కోపం ఎక్కువ :వంశీ
X
టాలీవుడ్ లోని విల‌క్ష‌ణ దర్శకుల‌లో వంశీ రూటే సెప‌రేటు. వంశీ తెరెకెక్కించిన 'మంచుపల్లకి' .. 'మహర్షి' .. 'సితార' .. 'అన్వేషణ' .. 'లేడీస్ టైలర్' .. 'ఏప్రిల్ 1 విడుదల` - `ఔను వాళ్లిద్ద‌రూ ఇష్ట‌ప‌డ్డారు` - `గోపి గోపికా గోదావ‌రి` వంటి సినిమాలు ఎవ‌ర్ గ్రీన్ హిట్స్ గా నిలిచిపోయాయి. ఆ సినిమాలతో పాటు అందులోని పాట‌ల‌లో కూడా వంశీ మార్క్ క్రియేటివిటీ క్లీయ‌ర్ గా క‌నిపిస్తుంది. వంశీ సినిమాల్లోని పాత్ర‌లు కూడా ఎంతో విల‌క్ష‌ణంగా ఉంటాయి. ఇంత క్రియేటివిటీ ఉన్న వంశీ కి కోపం - చిరాకు చాలా ఎక్కువ‌ని టాలీవుడ్ లో ఒక టాక్ ఉంది. తాజాగా - ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వంశీ ఆ విష‌యంపై క్లారిటీ ఇచ్చేశారు.

కొద్దిరోజుల క్రితం వంశీ తెర‌కెక్కించిన ఫ్యాష‌న్ డిజైన‌ర్ ..స‌న్నాఫ్ లేడీస్ టైల‌ర్...డిజాస్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆ చిత్ర షూటింగ్ స‌మ‌యంలో హీరో సుమంత్ అశ్విన్ పై వంశీ కోప్ప‌డ్డార‌ని వార్తలు వ‌చ్చాయి. ఈ విష‌యంపై వంశీ స్పందించారు. గ‌తంలో నిజంగానే త‌న‌కు కోపం బాగా వచ్చేదని - ఈ మధ్య రావడం లేదని వంశీ అన్నారు. కాలంతో పాటు త‌న‌లో కూడా మార్పులు వ‌చ్చాయ‌ని - త‌న‌లో కోపం తగ్గుతూ వచ్చిందని వంశీ చెప్పారు. ద‌ర్శ‌కుడిగా త‌న‌ క్రియేటివిటీకీ - వ్య‌క్తిగ‌తంగా త‌న కోపానికి సంబంధం లేదన్నారు. ఏదైనా ఒక విష‌యంలో - ప‌నిలో బాగా నిమ‌గ్న‌మైపోయిన‌పుడు కొంద‌రిపై కోప్ప‌డ‌డం స‌హ‌జ‌మ‌ని చెప్పారు. తాను కూడా సినిమా షూటింగ్ లో ఇన్ వాల్వ్ అయిన‌పుడు కోప్ప‌డేవాడిన‌ని - దాంతో త‌న‌నంద‌రూ తిక్క మనిషినని అనుకున్నార‌ని తెలిపారు. వాస్త‌వానికి `తిక్క‌` కు మించిన మాటల‌తో త‌న‌ను సంబోధించేవార‌ని - బ‌హుశా త‌న ధోర‌ణి వ‌ల్ల వారు అలా అనుకొని ఉండ‌వ‌చ్చ‌ని వంశీ తెలిపారు.