Begin typing your search above and press return to search.
ఇప్పుడు భారమంతా పైడిపల్లి పైనే..!
By: Tupaki Desk | 18 April 2022 4:30 PM GMT2007 లో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన వంశీ పైడిపల్లి.. ఈ పదిహేనేళ్లలో కేవలం ఐదు సినిమాలనే తెరకెక్కించారు. ఫస్ట్ సినిమా 'మున్నా' ప్లాప్ అయినా.. ఆ తర్వాత వచ్చిన 'బృందావనం' 'ఎవడు' 'ఊపిరి' మహర్షి' సినిమాలు మంచి విజయాలను అందించి వంశీని అగ్ర దర్శకుల సరసన నిలబెట్టాయి.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. అవన్నీ కూడా అగ్ర హీరోలతో చేసిన సినిమాలే. ఇప్పటి వరకు ప్రభాస్ - ఎన్టీఆర్ - రామ్ చరణ్ - అల్లు అర్జున్ - అక్కినేని నాగార్జున - కార్తీ - మహేష్ బాబు వంటి హీరోలతో కలిసి వర్క్ చేశారు వంశీ. ఈ క్రమంలో ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ను డైరెక్ట్ చేస్తున్నారు.
తలపతి విజయ్ కెరీర్ లో వస్తోన్న ఈ 66వ చిత్రాన్ని ఇటీవలే సెట్స్ మీదకు తీసుకెళ్లారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. Thalapathy66 ను భారీ స్థాయిలో బైలింగ్విల్ లో రూపొందిస్తున్నారు.
'ఊపిరి' సినిమా తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రెండో ద్విభాషా చిత్రమిది. ఈ సినిమా కోసం 'వైల్డ్ డాగ్' దర్శకుడు సోలమన్ కూడా వర్క్ చేస్తున్నాడు. 'మహర్షి' సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న వంశీ.. ఈ ప్రాజెక్ట్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే ఈ సినిమా విషయంలో ఇప్పుడు దర్శకుడు అదనపు బాధ్యతతో పాటుగా ఒత్తిడి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గత కొన్నాళ్లుగా విజయ్ వరుస విజయాలతో ఫుల్ ఫార్మ్ లో ఉన్నారు. యావరేజ్ కంటెంట్ తోనూ బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. అయితే ఇప్పుడు 'బీస్ట్' రూపంలో తలపతికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోంది. విడుదలైన అన్ని భాషల్లోనూ మిశ్రమ స్పందన తెచ్చుకుంది.
విజయ్ స్టార్ డమ్ వల్ల మంచి ఓపెనింగ్స్ వచ్చినా.. ఫైనల్ రన్ ముగిసే సమయానికి 'బీస్ట్' మూవీ ప్లాప్ గానే పరిగణించబడుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు - కన్నడ సినిమాలకు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోవడాన్ని విజయ్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. నెక్స్ట్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టి మళ్ళీ తానేంటో చాటిచెప్పాలని వారు కోరుకుంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ తో వంశీ పైడిపల్లి సినిమా చేస్తున్నాడు. తమిళ స్టార్ హీరోకి ఇప్పుడు టాలీవుడ్ దర్శకుడు కచ్చితంగా హిట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులోనూ ఇది విజయ్ కు ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు సినిమా. ఏ హీరో అయినా తొలి అడుగు గట్టిగానే వెయ్యాలని ఆశిస్తారు.
మరోవైపు వంశీ కూడా ఈసారి తన సత్తా ఏంటో చూపించాల్సిన అవసరం ఉంది. 'మహర్షి' సినిమా బ్లాక్ బస్టర్ అయినా.. జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినా.. అతనిపై ఇప్పటికీ ట్రోల్స్ వస్తున్నాయి. మహేష్ బాబు ఉన్నాడు కాబట్టే అలాంటి కంటెంట్ జనాలకి రీచ్ అయిందని.. దర్శకుడి ప్రతిభ ఏమీ లేదనే కామెంట్స్ వచ్చాయి.
ఈ నేపథ్యంలో విజయ్ తో చేసే సినిమాతో వంశీ తన స్టామినా ఏంటో బాక్సాఫీస్ కు చూపించాల్సి ఉంది. ట్రోల్ చేసిన వాళ్ళతోనే ప్రశంసలు అందుకోవాలి. అలానే విజయ్ కు సూపర్ సక్సెస్ అందివ్వాలి. ఇది దర్శకుడికి మరింత బాధ్యతతో పాటుగా ఎక్స్ట్రా ప్రెజర్ ను కలిగిస్తుందనడంలో సందేహం లేదు.
అయితే స్లో అండ్ స్టడీగా సినిమాలు చేసే వంశీ.. Thalapathy66 పై ధీమాగా ఉన్నారు. దాదాపు రెండేళ్లుగా వర్క్ చేసి రెడీ చేసిన ఈ స్క్రిప్టు.. కచ్చితంగా జనాలకు మెప్పిస్తుందని నమ్ముతున్నారని తెలుస్తోంది. మరి తన కెరీర్లోనే అతి పెద్ద సవాలుకు సిద్ధమవుతున్న పైడిపల్లి.. వచ్చే ఏడాది ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.