Begin typing your search above and press return to search.
చిన్న మెసేజ్ బింబిసార సినిమా అయ్యిందట
By: Tupaki Desk | 2 Aug 2022 4:36 AM GMTఈ వారం విడుదలవుతున్న మూవీల్లో అందరిని ఆకర్షిస్తున్న చిత్రం బింబిసార. కల్యాణ్ రామ్ హీరోగా.. కేథరిన్.. సంయుక్తా మేనన్ కథానాయకులుగా నటించిన ఈ మూవీ అసలు పట్టాల మీదకు ఎలా వచ్చిందన్న ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు చిత్ర దర్శకుడు వశిష్ఠ్.
తనకు ఫాంటసీ మూవీలంటే ఇష్టమని.. అందుకే తన తొలి ప్రయత్నంలో టైమ్ ట్రావెల్ ను ఎంచుకున్నట్లు చెప్పారు.
దాదాపు మూడేళ్ల క్రితం (2019లో) ఎన్టీఆర్ మహా కథానాయకుడు మూవీ షూటింగ్ జరుగుతున్న వేళలో.. కల్యాణ్ రామ్ కు ఒక చిన్న మెసేజ్ పెట్టానని చెప్పారు. 'ఒక మంచి కథ ఉంది.
కలవొచ్చా' అని మెసేజ్ పెట్టా. వెంటనే పిలిపించారు. కథ విన్నారు. నచ్చిందని చెప్పారు. చేద్దామన్నారు. తర్వాత నిర్మాత హరిక్రిష్ణకు కథ ఓకే కావటంతో మూవీ మొదలైనట్లు చెప్పారు. అలా.. బింబిసార మూవీ ఒక చిన్న మేసేజ్ తో మొదలైన ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ మూవీకి ముందు కల్యాణ్ రామ్ కు రెండు కథల్ని వినిపిస్తే.. అవి రెండు రిజెక్టు అయ్యాయని.. బింబిసారతో తొలిసారి దర్శకుడిగా వెండితెరకు పరిచయమవుతున్నట్లు చెప్పారు.
దీనికి ముందు రవితేజ.. శిరీష్ లకు కథలు వినిపించినా వర్కువుట్ కాలేదని.. తాజాగా ఇంత పెద్ద మూవీతో లాంఛ్ అవుతున్న వైనాన్నిషేర్ చేసుకున్నారు. టైం అంటే అలానే ఉంటుంది. వరుస రిజెక్టుల్ని ఎదుర్కొన్న వశిష్ఠ్ తన తొలి చిత్రాన్ని ఎలా తీశారన్న దానికి మరో మూడు రోజులు వెయిట్ చేస్తే సరి.