Begin typing your search above and press return to search.

శ్రుతిహాసన్ పాత్ర అవసరం లేదన్నవారికి నేను చెప్పేది ఇదే!

By:  Tupaki Desk   |   15 April 2021 4:31 AM GMT
శ్రుతిహాసన్ పాత్ర అవసరం లేదన్నవారికి నేను చెప్పేది ఇదే!
X
'వకీల్ సాబ్' .. ఇప్పుడు ఎక్కడ చూసినా అంతా ఈ సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. అందుకు కారణం ఆ వకీల్ సాబ్ పవన్ కల్యాణ్ కావడమే. థియేటర్ కి వెళ్లిన తరువాత కథా కథనాల సంగతి .. కానీ ఆ థియేటర్ కి వెళ్లేది మాత్రం పవన్ కోసమే. అసలే అయన కొంత గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ఇది. అందువల్లనే ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత థియేటర్లతో ఎడబాటును ప్రేక్షకులు భరించలేకపోయారు .. ఈ షోకి టికెట్స్ లేవు .. నెక్స్ట్ షోకి మాత్రమే టికెట్లు ఉన్నాయనే మాటను కూడా వాళ్లు తట్టుకోలేకపోయారు.

ఈ నెల 9వ తేదీన విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో జూలు విదిల్చింది. విడుదలైన ప్రతి థియేటర్లో విజయంతో గర్జించింది. ఈ నేపథ్యంలో ఈ సక్సెస్ ను గురించి దర్శకుడు వేణు శ్రీరామ్ తాజా ఇంటర్వ్యూలో స్పందించాడు. ఆయన మాట్లాడుతూ .. ఈ సినిమాలో శ్రుతిహాసన్ పాత్రకి ఎక్కడా పెద్ద ఇంపార్టెన్స్ లేదు .. కావాలని ఆ పాత్రను పెట్టినట్టుగా అనిపిస్తుంది .. అసలు ఆ పాత్రనే అవసరం లేదు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమాలో బోర్ కొట్టే అంశం ఏదైనా ఉందంటే, అది ఆమె పోర్షన్ మాత్ర్రమే అని అంటున్నారు.

శ్రుతి హాసన్ పాత్రను కావాలని కల్పించలేదు .. అనవసరంగా పెట్టలేదు .. ఈ సినిమాలో ఆ పాత్ర అవసరమే. వకీల్ సత్యదేవ్ పాత్ర వెనకున్న కథ ఏమిటనేది మనకి తెలియాలి. సత్యదేవ్ తన జీవితంలో కోల్పోయినదేమిటి అనేది చెప్పినప్పుడే ఆ పాత్ర వెయిట్ పెరుగుతుంది. శ్రుతిహాసన్ పరంగా ఆయన జీవితంలో ఒక విషాదం జరిగింది. అందువలన అది తెరపై చూపించవలసిందే. అప్పటికే అసలు కథ మొదలవుతుంది కనుక, ఈ ట్రాక్ కొంతమందికి కాస్త బోరింగ్ గా అనిపించి ఉండవచ్చునేమో" అని చెప్పుకొచ్చాడు.