Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ తో సినిమా.. వెట్రిమారన్ ఏమన్నాడంటే?
By: Tupaki Desk | 11 April 2023 9:00 PM GMTజూనియర్ ఎన్టీఆర్ హీరోగా తమిళ్ స్టార్ దర్శకుడు వెట్రిమారన్ తో ఒక సినిమా ఉంటుంది అనే ప్రచారం చాలా కాలంగా నడుస్తోంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆ ప్రచారం మరింత ఎక్కువ అయ్యింది. వెట్రిమారన్ తారక్ కి కథ కూడా చెప్పాడని, ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ ప్రచారంపై తాజాగా దర్శకుడు వెట్రిమారన్ క్లారిటీ ఇచ్చారు.
ఆయన తమిళంలో సూరి, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో తీసిన విడుతలై 1 తెలుగులో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం వెట్రిమారన్ హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తారక్ తో సినిమా చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై కూడా క్లారిటీ ఇచ్చారు.
తాను తారక్ కి కలవడం జరిగిందని, అలాగే మా ఇద్దరి కాంబినేషన్ లో సినిమా కూడా ఉంటుంది అనేది వాస్తవమేనని చెప్పారు. అయితే దానికి ఇంకా చాలా సమయం ఉందని అన్నారు. చాలా కాలంగా తెలుగులో సినిమాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నానని వెట్రిమారన్ చెప్పారు. ఆడుకాలమ్ సినిమా తర్వాత వడా చెన్నై స్క్రిప్ట్ తో అల్లు అర్జున్ ని కలవడం జరిగిందని, స్టొరీ కూడా చెప్పానని వెట్రిమారన్ తెలిపారు.
అయితే కొన్ని కారణాల వలన తమ కాంబినేషన్ సెట్ కాలేదని క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుని కలిసి కథ చెప్పడం జరిగిందన్నారు. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ని కలిసానని పేర్కొన్నారు. కరోనా లాక్ డౌన్ టైమ్ లో వారిని కలిసి కథలు నేరేట్ చేసానని అన్నారు. ప్రస్తుతం చర్చల దశలో ప్రాజెక్ట్స్ ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు.
అయితే కచ్చితంగా తెలుగులో మూవీ ఉంటుందని, అయితే ఎప్పుడనేది చెప్పలేనని వెట్రిమారన్ తెలిపారు. మొత్తానికి వెట్రిమారన్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఉంటుందనే ప్రచారం వాస్తవమే ఆయన మాటలతోనే క్లారిటీ ఇచ్చేసారని చెప్పాలి. వెట్రిమారన్ కథలని భారతీయ సమాజంలో వెనుకబడిన వర్గాల మూలాలలోకి వెళ్లి చెబుతూ ఉంటారు. మరి అలాంటి కథతోనే తారక్ కి మెప్పించి సినిమా చేస్తాడా అనేది చూడాలి.