Begin typing your search above and press return to search.

నాగబాబు పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన యంగ్ డైరెక్టర్...!

By:  Tupaki Desk   |   31 May 2020 10:01 AM GMT
నాగబాబు పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన యంగ్ డైరెక్టర్...!
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా నందమూరి బాలకృష్ణ - మెగా బ్రదర్ ఇష్యూ నడుస్తోంది. సినీ ఇండస్ట్రీ పెద్దలు తనని పిలవకుండా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడంపై బాలకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించి బాలయ్యపై ఒక వీడియో ద్వారా విరుచుకుపడ్డారు. నాగబాబు మాట్లాడుతూ.. సినీ పరిశ్రమపై నోరు జారొద్దు. మీటింగ్‌ కు ఎవరిని పిలవాలో కమిటీకి తెలుసు. బాలయ్య తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. బాలయ్య నోరు అదుపులో ఉంచుకోవాలి. బాలయ్య ఒకటంటే.. మేము రెండు మాటలనేందుకు రెడీగా ఉన్నాం. ప్రభుత్వానికీ సినీ ఇండస్ట్రీకి బాలయ్య క్షమాపణలు చెప్పాలి. ఇండస్ట్రీకి మీరు కింగ్ కాదు జస్ట్ ఒక హీరో మాత్రమే అంటూ పలు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారాన్ని రేపాయి. నాగబాబు వ్యాఖ్యలపై నందమూరి అభిమానులు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ త్రిపురనేని విజయ్ చౌదరి నాగబాబుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు. డైరెక్టర్ విజయ్ చౌదరి సుప్రసిద్ధ రచయిత త్రిపురనేని మహారథి మనవడు.. దర్శక నిర్మాత త్రిపురనేని చిట్టి తనయుడు. 'కవ్వింత' అనే సినిమాకి దర్శకత్వం వహించారు. ఇప్పుడు నాగబాబు వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన ఒక వీడియో రిలీజ్ చేసాడు.

విజయ్ చౌదరి  మాట్లాడుతూ నాగబాబు సంపూర్ణేష్ బాబు అంత పెద్ద నటుడని.. ఇండస్ట్రీలో ఆర్టిస్ట్స్ అందరిని లైన్లో నిలబెడితే వెనకనుండి మొదట ఉండే మీరు బాలయ్య బాబుని అంటుంటే ఎవరూ చూస్తూ ఊరుకోరు అంటూ విరుచుకుపడ్డాడు. నువ్వు చిరంజీవి తమ్ముడివి కాకపోతే.. పవన్ కళ్యాణ్ అన్న వి కాకపోతే మీకు అసలు గుర్తింపే లేదు.. అంటూ తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా నువ్వు ఇండస్ట్రీకి చేసిన గొప్ప ఏంటి.. బాలయ్య బాబుని పిలవకుండా మీటింగ్స్ జరిపే అంత కెపాసిటీ ఉందా మీకు.. మీ అన్న చిరంజీవి కూడా హీరో మాత్రమే.. ఇండస్ట్రీ మొత్తం మీ ఫ్యామిలీది అనుకుంటున్నారా.. బాలయ్య బాబుని మీటింగుల పిలవాల్సిన భాద్యత మీది అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసాడు. బాలయ్యని నువ్వేమి కింగ్ కాదు అంటున్నావ్.. నువ్వేమన్నా కింగా.. మీ అన్నా తమ్ముడు కింగ్ లు అనుకుంటున్నారా.. మీలాగా బాలయ్య మనసులో ఒకటి పెట్టుకొని బయటకి ఒకటి చెప్పేవాడు కాదు అంటూ విమర్శించాడు.

అంతేకాకుండా మీ సామాజిక వర్గంలో మీరు కాకుండా ఇంకొక హీరో పైకి ఎందుకు ఎదగలేదు..? కేవలం మీ స్వార్థ బుద్ధి వలన మీ సామాజిక వర్గంలో మరో హీరోని రానివ్వకుండా తొక్కేశారు.. మీరు పెట్టిన పీఆర్పీ పార్టీకి ఫండ్స్ ఇచ్చిన మీ వర్గం వారిని నాశనం చేసిన మీరు బాలయ్య బాబు గురించి మాట్లాడతారా అని ప్రశ్నించాడు. బాలయ్య ఇండస్ట్రీలో సమావేశాలకు పిలవలేదని కోపంతో మాట్లాడినప్పుడు మీలాంటి వారు ఎందుకు పిలవలేదని ఆలోచించాలి.. అసలు ఇండస్ట్రీలో ఉన్న కమిటీలు ఏంటి.. దాంట్లో ఉన్న మెంబెర్స్ ఎవరు.. గట్టిగా నాలుగు సినిమాలు కూడా తీయని వారు డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అవుతాడు.. వీళ్లంతా ఇండస్ట్రీకి చేసేదేమీ లేదు అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. ఇక నాగబాబు రాజకీయాల్లో మాట్లాడినట్లు ఇక్కడ మాట్లాడితే సమయం వచ్చినప్పుడు సరైన విధంగా బుద్ధి చెప్తామంటూ వార్నింగ్ ఇచ్చాడు త్రిపురనేని విజయ్ చౌదరి. ఇప్పుడు డైరెక్టర్ విజయ్ చౌదరి మాట్లాడిన వీడియో సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ అవుతూ వైరల్ అయింది. మరి ఈ యంగ్ డైరెక్టర్ వ్యాఖ్యలపై నాగబాబు మరియు ఇండస్ట్రీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.