Begin typing your search above and press return to search.
'ఢిల్లీ ఫైల్స్' పై వెనక్కి తగ్గేదేలే అనేసిన వివేక్ అగ్నిహోత్రి!
By: Tupaki Desk | 21 April 2022 3:30 PM GMT'ది కశ్మీర్ ఫైల్స్' తో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఎలాంటి సంచలనాలు నమోదు చెసారో చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన సినిమా బాక్సాఫీస్ ని వసూళ్లతో షేక్ చేసింది. 250 కోట్ల వసూళ్లు సాధించి చిన్న సినిమాల్లో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుని సృష్టించింది. దేశం మొత్తం సినిమా గురించి మాట్లాడిందంటే కశ్మీర్ ఫైల్స్ సక్సెస్ గురించి మాట్లాడేది ఇంకేముంటుంది.
కశ్మీర్ పండిట్ల ఊచకతోపై తెరకెక్కిన సినిమా రిలీజ్ తర్వాత కొన్ని విమర్శల్ని...వివాదాల్ని ఎదుర్కున్నప్పటికీ ప్రధాని మోదీ సైతం సినిమాని మెచ్చి అన్ని వివాదాల్ని చల్లార్చారు. ఇప్పుడు ఇదే ఊపులో వివేక్ అగ్నిహోత్రి 'ది ఢిల్లీ ఫైల్స్' అంటూ మరో సంచలనానికి తెరలేపిన సంగతి తెలిసిందే. ఇటీవలే సినిమా ప్లాట్ ని కూడా రివీల్ చేసారు. దీనిపై మహారాష్ర్ట సిక్కు అసోసియేషన్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది.
సృజనాత్మక వ్యక్తీకరణ పేరుతో వ్యక్తిగత లాభం కొరకు మానవ జీవితంలో జరిగిన సిక్కు అల్లర్ల విషాదాలను తెరకెక్కిస్తున్నారు. ఇది ఎవరికీ మంచిది కాదు. వ్యక్తగత లాభం కోసం చేసే పనులు ఇవన్నీ. సమాజ శాంతికి భంగం కల్గించకుండా ఉండే మంచిదని హెచ్చరించారు. తాజాగా వీటిపై వివేక్ అగ్నిహోత్ని తనదైన శైలిలో స్పందించారు.
ఈ సంస్థ ఏంటి? అన్నది నాకు తెలియదు. నేను భారతీయుడిని. ప్రజాస్వామ్య దేశంలో నివసిస్తున్నాను. ఇక్కడ రాజ్యాంగం నాకు నచ్చింది. నచ్చిన విధంగా వ్యక్తికరంచే హక్కు నాకుంది. నా మనసు ఏది చెబితే అది చేస్తాను. నాకు ఏది నిజమనిపిస్తే అది చేస్తాను. ఎవరి డిమాండ్లకు తలవంచను. ఎవరి బెదిరింపులకు భయపడను. నేను ఏ సంస్థకి సేవకుడిని కాదు.
అయినా నేను ఏమి తీస్తున్నానో..ఎలా తీస్తున్నానో నాకే తెలియదు. అప్పుడే విమర్శలు తగునా? దీని గురించి ఎవరిష్టాను సారం వారు ఊహించుకుటున్నారు. అయినా నేను తీసిన సినిమా నచ్చకపోయినా..అందులో అభ్యంతరాలు ఉన్నా సెన్సార్ వారే ఆపేస్తారు. సినిమా రిలీజ్ కి రాదు. అంతదానికి..ఏమీ లేని దానికి ఎందుకంత ఉలుకు అంటూ కౌంటర్ వేసారు.
ప్రస్తుతం వివేక్ చేసిన ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఢిల్లీ ఫైల్స్ కోసం ఎలాంటి నటీనటుల్ని తీసుకుంటారు? అన్నది చూడాలి. 'కశ్మీర్ పైల్స్' లో చాలా మంది కొత్తవారే. అయినా సినిమా పెద్ద సక్సెస్. కాబట్టి మళ్లీ వివేక్ అలాంటి ప్రయత్నం చేస్తారా? సీనియర్ నటుల వైపు చూస్తారా? అన్నది తెలియాలి.