Begin typing your search above and press return to search.
దేవుళ్ల లాగా ప్రవర్తిస్తారు.. సౌత్ ని మూర్ఖులని ఎగతాళి చేస్తారు!
By: Tupaki Desk | 18 Sep 2022 5:46 AM GMTబాలీవుడ్ ని బహిష్కరించమని కోరే ప్రచారం చాలా బాగుందని.. ఇది సరైనదేనని తాను నమ్ముతున్నట్టు ప్రముఖ దర్శక నిర్మాత వివేక్ రంజన్ అగ్నిహోత్రి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ బాలీవుడ్ ను బహిష్కరించాలన్న ప్రచారం చాలా బాగుందని తాను భావిస్తున్నట్లు వెల్లడించారు. ఇది బాలీవుడ్ నిర్మిస్తున్న చిత్రాలపై ప్రజల నిరాశను బహిర్గతం చేస్తోందని అభిప్రాయపడ్డారు. అయితే దాని తుది ఫలితం `చాలా సానుకూలంగా` ఉంటుందని వివేక్ అగ్నిహోత్రి ఆశాభావం వ్యక్తం చేసారు.
ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ గా అగ్నిహోత్రి పేరు ఇటీవల ముంబై పరిశ్రమలో మార్మోగుతోంది. ఆయన తన మనసులో ఉన్నది దాచుకోకుండా బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఇంతకుముందు అనురాగ్ కశ్యప్- కరణ్ జోహార్- రణ్‌వీర్ సింగ్ సహా ఇతర ప్రముఖులపై నిందలు వేసిన వివేక్ అగ్నిహోత్రి ఇప్పుడు బాలీవుడ్ బహిష్కరణ ధోరణి బాలీవుడ్ సినిమాలపై ప్రజల నిరాశను చూపుతోందని అన్నారు. తుది ఫలితం చాలా సానుకూలంగా ఉంటుందనే వాస్తవాన్ని కూడా అతను ధృవీకరించాడు.
దక్షిణ భారతీయులు.. కాశ్మీరీ ముస్లింలు.. బెంగాలీలపై వారి చెడు ఆధిపత్యం కారణంగా బాలీవుడ్ తో సమస్యలు ఉన్నాయి. బాలీవుడ్ తమ కొనుగోలుదారులైన (సినిమాలు చూసేవాళ్లు) మధ్యతరగతిని ఎగతాళి చేస్తుంది. వారు ప్రజలను మూర్ఖులని భావిస్తారు. సౌత్ ఇండియన్ సినిమా స్టార్స్ లాగా బాలీవుడ్ జనాలతో కనెక్ట్ అవ్వదు. వాళ్ళు దేవుళ్లు అన్నట్లుగా ప్రవర్తిస్తారు. సౌత్ ఇండియన్- మరాఠీ- బెంగాలీ- ఒడియా ఇతర సినిమా సబ్జెక్ట్ లు మాస్ కి ప్రతిధ్వనిస్తాయని కూడా అన్నారు. బాలీవుడ్ హిందీ వాళ్లకు తప్ప ఇంకెక్కడా కనెక్టవ్వదనే పరోక్ష విమర్శ ఆయన చేసారు. మీరు బాలీవుడ్ లో భాగమని భావిస్తున్నారా అని అడిగినప్పుడు వివేక్ అగ్నిహోత్రి ``లేదు.. నేను కాదు`` అని బదులిచ్చారు. అతడు తెరకెక్కించిన కాశ్మీర్ ఫైల్స్ చిత్రం దాదాపు 300 కోట్ల వసూళ్లతో ఈ ఏడాది బాలీవుడ్ బెస్ట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.