Begin typing your search above and press return to search.
8 ఏళ్ళ తరువాత వస్తున్న క్లాసిక్ డైరెక్టర్ ?
By: Tupaki Desk | 18 July 2019 11:23 AM GMTటాలీవుడ్ ప్రేమ కథల్లో ఓ కొత్త మలుపుకు దారి తీసిన చిత్రంగా మనసంతా నువ్వే గురించి చెప్పుకోవచ్చు. ఉదయ్ కిరణ్ కు స్టార్ స్టేటస్ రావడంలో దీని పాత్ర చాలా ఉంది. గ్లామర్ ఫ్యాక్టర్ లేకుండా కేవలం ఎమోషన్స్ మీదే దర్శకుడు విఎన్ ఆదిత్య నడిపిన తీరు అప్పట్లో సంచలనం రేపింది. డెబ్యూతోనే అంత పెద్ద హిట్టు కొట్టి నాగార్జునతోనే సినిమా చేసే ఛాన్స్ కొట్టేసిన ఆదిత్య నేనున్నానుతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు.
ఆ తర్వాత ఆట ఓ మాదిరిగా ఆడినా నాగ్ ఇచ్చిన రెండో ఛాన్స్ బాస్ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఆదిత్య లాస్ట్ తీసిన మూవీ సురేష్ సంస్థ నిర్మించిన ముగ్గురు. ఆ తర్వాత సుమారుగా ఎనిమిదేళ్ల గ్యాప్ లో ఉన్నారీయన. ఇండస్ట్రీలోనే ఉన్నప్పటికీ సరైన సబ్జెక్టు మీద వర్క్ అవుట్ చేస్తూ ఇంతకాలం ఆగారు. ఇప్పుడు ఆ ముహూర్తం వచ్చినట్టుగా ఫిలిం నగర్ టాక్. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో సుమంత్ ఆశ్వన్ హీరోగా ఓ ప్రాజెక్ట్ రూపొందబోతున్నట్టుగా ఇన్ సైడ్ టాక్.
ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నట్టుగా తెలిసింది. అంతా ఓకే అయితే అనౌన్స్ మెంట్ రావొచ్చు. సుమంత్ అశ్విన్ తండ్రి ఎంఎస్ రాజు గారి బ్యానర్ లోనే విఎన్ ఆదిత్య రెండు సినిమాలు చేశారు. ఆరకంగా కూడా బాండింగ్ ఉంది. అల్లు అరవింద్ ఓకే చేశారు అంటే కంటెంట్ ఉండే ఉంటుంది. ఇటీవలే జెర్సి చూసిన తన అబ్బాయి నువ్వెందుకు దర్శకత్వం చేయడం లేదని అడిగాడని అందుకే ప్రయత్నాల్లో ఉన్నానని విఎన్ ఆదిత్య చెప్పిన కొద్దిరోజులకే ఈ న్యూస్ రావడం విశేషం. అధికారిక ప్రకటన వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయి