Begin typing your search above and press return to search.

నిర్మాత‌తో ద‌ర్శ‌కుడి గొడ‌వ‌లు చినికి చినికి గాలివానై!?

By:  Tupaki Desk   |   13 Sep 2022 5:30 AM GMT
నిర్మాత‌తో ద‌ర్శ‌కుడి గొడ‌వ‌లు చినికి చినికి గాలివానై!?
X
మ‌రో మూడు రోజుల్లో తాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా విడుద‌ల‌వుతోంది. 16 సెప్టెంబ‌ర్ రిలీజ్ డేట్. కానీ ఆ దర్శ‌కుడు ప్ర‌మోష‌న్స్ లో ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. మూవీకి అత్యంత కీల‌క‌మైన ప్రీరిలీజ్ -ట్రైల‌ర్ ఈవెంట్లో కూడా మిస్స‌య్యాడు. అంతేకాదు.. తాజా ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్లోనూ అత‌డు క‌నిపించ‌క‌పోవ‌డంతో బోలెడ‌న్ని సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అత‌డు ఎందుకిలా చేస్తున్నాడు? త‌న సినిమాని తాను ప్ర‌మోట్ చేసుకోకుండా కినుక వ‌హించ‌డం వెన‌క కార‌ణ‌మేమిటీ? అన్న‌ది ఆరా తీస్తే కొన్ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. నిజానికి త‌న నిర్మాత‌ల‌తో అత‌డికి పొస‌గ‌డం లేదు. విభేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. త‌న‌కు చెప్ప‌కుండా కొంత భాగం షూటింగ్ ని వేరొక ద‌ర్శ‌కుడితో పూర్తి చేసేసార‌ట‌. దాంతో అలిగిన దర్శ‌కుడు మూవీ ప్ర‌మోష‌న్స్ కి రావ‌డం లేదని గుస‌గుస వినిపిస్తోంది.

అంతేకాదు.. ఇటీవ‌లే 'ఒకే ఒక జీవితం' మూవీ ట్రైల‌ర్ ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసి ప్ర‌శంస‌లు కురిపించిన‌ అత‌డు త‌న సినిమా ట్రైల‌ర్ ని కానీ పోస్ట‌ర్ ని కానీ క‌నీస మాత్రంగా అయినా షేర్ చేయ‌క‌పోవ‌డంతో విభేధాలు పెద్ద స్థాయిలోనే కొన‌సాగుతున్నాయ‌ని మీడియా భావిస్తోంది. అయితే చిత్ర‌బృందం త‌మ ద‌ర్శ‌కుడు లేక‌పోయినా కానీ పాపుల‌ర్ హీరోని ప్ర‌ముఖ యువ‌ ద‌ర్శ‌కుడిని ప్ర‌చారానికి ఉప‌యోగించుకుంటూ క‌వ‌ర‌ప్ చేస్తోంది.

ప్ర‌స్తుతం ఈ యంగ్ డైరెక్ట‌ర్ మాస్ మ‌హారాజ్ తో ఓ సినిమా చేస్తున్నారు. దానిపైనే అత‌డు కాన్ స‌న్ ట్రేట్ చేశార‌ని తెలిసింది. కెరీర్ ఆరంభ మూవీతో హిట్టు కొట్టి త‌ర్వాత ఒక ఫ్లాప్.. ఒక యావ‌రేజ్ ఒక డిజాస్ట‌ర్ తెర‌కెక్కించిన అత‌డు త‌దుప‌రి ర‌వితేజ‌పైనే పూర్తి ఆశ‌లు పెట్టుకున్నాడ‌ని తెలిసింది.

క‌ల‌త‌ల కాపురంలో ఇవన్నీ మామూలే అనుకున్నా కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసే సినిమాల వ్య‌వ‌హారంలో ద‌ర్శ‌క‌నిర్మాత‌ల మధ్య గొడ‌వ‌ల్ని తీర్చే వ్య‌వ‌స్థ స‌రిగా లేక‌పోతే ఇలానే అవుతుంది. ప్రాజెక్టుకి ఎంతో కీల‌క‌మైన దర్శ‌కుడితోనే నిర్మాత‌లు ఘ‌ర్ష‌ణ ప‌డితే అది ఎలాంటి ముప్పో తెలియ‌నిది కాదు. ఇలాంటి డైల‌మా స‌న్నివేశం నుంచి బ‌య‌ట‌కు రాక‌పోతే అంతే సంగ‌తి. క‌నీసం ద‌ర్శ‌క సంఘం కానీ నిర్మాత‌ల మండ‌లి కానీ ఇలాంటి వాటికి స‌రైన ప‌రిష్కారం సూచించే దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు.

ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌ల‌తో ఒక మంచి ప్రాజెక్ట్ డీలా ప‌డిపోకూడ‌దు. ఇలాంటి క్లిష్ట‌ స‌మ‌యాల్లో సినిమాకి అండ‌గా నిలిచేందుకు ఫిలింఛాంబ‌ర్ ఏదో ఒక‌టి చేయాల‌ని కోరుతున్నారు. ద‌ర్శ‌కుడి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే.. ప‌రిశ్ర‌మ‌లో అన్నిటికీ ఒక‌టే స‌మాధానం. మంచి హిట్టు కొట్టి స‌త్తా చాట‌డం. అది చేసి చూపిస్తాడ‌నే భావిద్దాం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.