Begin typing your search above and press return to search.
పాతికేళ్ల సందర్బంగా కన్ఫర్మ్ చేసిన దర్శకేంద్రుడు
By: Tupaki Desk | 12 Jan 2021 4:30 PM GMTశ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా 'పెళ్లి సందడి ' సినిమాను దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు తాను దర్శకత్వ పర్యవేక్షణ చేస్తుండగా తన శిష్యురాలు గౌరీ దర్శకత్వం వహించబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించాడు. హీరోయిన్ విషయంలో చాలా రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. జాన్వీ కపూర్ ను లేదా ఖుషీ కపూర్ ను ఈ సినిమాలో నటింపజేసేందుకు రాఘవేంద్ర రావు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి. కాని వారిద్దరు ఎవరు కాదని కొత్త అమ్మాయిని రాఘవేంద్ర రావు అధికారికంగా ప్రకటించారు.
పెళ్లి సందడి సినిమా విడుదల అయ్యి పాతిక సంవత్సరాలు అవుతున్న సందర్బంగా హీరోయిన్ గా కన్నడ బ్యూటీ శ్రీలీలా అనే అమ్మాయిని ఎంపిక చేయడం జరిగింది అంటూ స్వయంగా రాఘవేంద్ర రావు ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ఆయన ట్విట్టర్ లో... ఈ పాతికేళ్ల #పెళ్లిసందడి సంబరాలను రెట్టింపు చేయడానికి #పెళ్లి సందడి సినిమా ని శ్రీకాంత్ వారసుడు రోషన్, శ్రీ లీల తో చేస్తున్నాము.. నా దర్శకత్వ పర్యవేక్షణ లో నా సహాయ దర్శకురాలు గౌరీ దర్శకత్వం చేస్తుంది. ప్రస్తుతం చిత్రీకరిస్తున్నాం... త్వరలో థియేటర్లో కలుద్దాం... అంటూ ట్వీట్ చేశారు. సినిమాపై భారీ అంచనాలు ఉన్న కారణంగా త్వరలోనే సినిమాను పూర్తి చేసే అవకాశం ఉందంటున్నారు. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ లో అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా కంటెంట్ ఉంటుంది.. యూత్ ఆడియన్స్ ను కట్టిపడేసే రొమాన్స్ ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.