Begin typing your search above and press return to search.
30 వెడ్స్ 21 : తాను అనుకున్నది తప్పన్న పవన్ డైరెక్టర్
By: Tupaki Desk | 27 May 2021 5:30 AM GMTగత కొన్ని రోజులుగా యూట్యూబ్ లో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న సిరీస్ 30 వెడ్స్ 21. ఈ యూట్యూబ్ సిరీస్ ఇప్పటి వరకు నాలుగు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాలుగు పార్టలు కూడా మిలియన్ ల కొద్ది వ్యూస్ ను దక్కించుకున్నాయి. నాలుగు ఎపిసోడ్ లు కలిపి దాదాపుగా 3 కోట్ల వ్యూస్ ను దక్కించుకున్నాయి. ఇప్పటికి ఇంకా ఈ నాలుగు పార్ట్ లు కూడా ట్రెండ్డింగ్ లో ఉన్నాయి. పార్ట్ లు వస్తున్నా కొద్ది కొత్తగా చూస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. నాలుగు ఎపిసోడ్స్ ల్లో కూడా చక్కని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు రొమాంటిక్ సన్నివేశాలు మరియు భార్య భర్తల గొడవలను చూపించారు.
ముందు ముందు ఈ వెబ్ సిరీస్ ఒక సెన్షేషన్ గా మారబోతుంది. ఇంతటి సక్సెస్ అయిన ఈ యూట్యూబ్ సిరీస్ ఐడియా మొదట పవన్ కళ్యాణ్ దర్శకుడు హరీష్ శంకర్ వద్దకు వెళ్లిందట. 30 ఏళ్ల వ్యక్తితో 21 ఏళ్ల అమ్మాయికి పెళ్లి అయితే ఏం జరుగుతుందో ప్రతి ఇంట్లో కూడా చూస్తూనే ఉంటాం. మన తల్లి దండ్రులు 15 ఏళ్ల గ్యాప్ ఉన్న వారు కూడా ఉన్నారు. కనుక దీన్ని ప్రేక్షకులు ఆధరిస్తారని తాను భావించడం లేదని హరీష్ శంకర్ అన్నాడట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఒప్పుకున్నాడు. ఇటీవల ఈ యూట్యూబ్ సిరీస్ గురించి ఆయన స్పందించాడు.
నేను అనుకున్నది తప్పని మొదటి ఎపిసోడ్ కు వచ్చిన స్పందన తోనే నాకు అర్థం అయ్యింది. దర్శకుడు చక్కని స్క్రీన్ ప్లేతో సిరీస్ ను తెరకెక్కించడంతో పాటు ఆకట్టుకునే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరింతగా ఈ సిరీస్ కు ఆకర్షణ తెచ్చింది. టీమ్ అందరికి శుభాకాంక్షలు. ఈ సిరీస్ మరింతగా సక్సెస్ అవ్వాలని ఆకాంక్షిస్తూ హరీష్ శంకర్ శుభాకాంక్షలు తెలియజేశాడు. చైతన్య రావ్ మరియు అనన్యలు ఈ సిరీస్ లో కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.