Begin typing your search above and press return to search.
విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన స్టార్ డైరెక్టర్ భార్య..!
By: Tupaki Desk | 18 July 2022 9:36 AM GMTవివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఒకరు సుమారు రెండు దశాబ్దాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఎందరో స్టార్ హీరోలతో కలసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఆ దర్శకుడు.. తన భార్యను కూడా ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. కాస్ట్యూమ్ డిజైనింగ్ లో శిక్షణ ఇప్పించి మరీ తన సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా నియమించుకున్నారు. ఆ తర్వాత ఆమె కొంత మంది సెలబ్రిటీలకి పర్సనల్ డిజైనర్ గా కూడా పని చేసింది.
అయితే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో భార్యాభర్తలిద్దరూ దాదాపు నాలుగేళ్లుగా విడివిడిగా ఉంటున్నారట. ఈ నేపథ్యంలో తన భర్త నుంచి విడాకులు ఇప్పించమని కోరుతూ దర్శకుడి భార్య కోర్టు మెట్లు ఎక్కినట్లు ప్రచారం జరుగుతోంది.
ఆమె తమ వివాహాన్ని రద్దు చేయాలని కోరుతూ తాజాగా నాంపల్లి కోర్టులో డివోర్స్ కోసం అప్లై చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇది మ్యూచువల్ డివోర్స్ కాదని.. డైరెక్టర్ వైఫ్ మాత్రమే విడాకులు కోరుతున్నట్లుగా చెబుతున్నారు.
నిజానికి వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు కొన్నేళ్ల క్రితమే వార్తలు వచ్చాయి. అయితే ఇండస్ట్రీలో దర్శకుడితో సన్నిహితంగా ఉండే పలువురు ఇద్దరికీ రాజీ కుదిర్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే అతను తన భార్యను కాస్ట్యూమ్ డిజైనింగ్ వృత్తిలోకి తీసుకొచ్చి.. తన వంతు సపోర్ట్ చేశారు.
కొన్నేళ్ల పాటు అంతా బాగానే ఉండగా.. మళ్లీ ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని అంటున్నారు. అయితే ఇప్పుడు ఏకంగా విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారని టాక్ నడుస్తోంది. కాకపోతే డివర్స్ తీసుకోవడం డైరెక్టర్ కు ఓకేనా కాదా అనే విషయం మీద కూడా క్లారిటీ రావడం లేదు.
నిజానికి గత కొంతకాలంగా దర్శకుడి కెరీర్ ఆశించిన విధంగా లేదు. వరుస ప్లాప్స్ రావడం.. అనౌన్స్ చేసిన సెట్స్ మీదకు వెల్లకపోవడం నిరాశ పరిచాయి. అయితే ఈ మధ్య చిత్ర పరిశ్రమకు దూరంగా ఉండటానికి ఆయన వ్యక్తిగత జీవితంలోని ఇబ్బందులు కూడా కారణమని నివేదికలు వస్తున్నాయి. మరి త్వరలోనే వీరి విడాకుల పై స్పష్టత వస్తుందేమో చూడాలి.