Begin typing your search above and press return to search.
డైరెక్టర్ ఛేంజ్.. ఇదే కొత్త కాదు!
By: Tupaki Desk | 25 Jan 2019 10:44 AM GMTఒక సినిమా ప్రారంభంలో ఒక దర్శకుడు, ముగింపులో ఇంకో దర్శకుడు కనిపించడం అన్నది హాలీవుడ్ సంస్కృతి. అక్కడ ఏళ్ల తరబడి అసాధారణ బడ్జెట్లతో సినిమాలు తీస్తారు. ఆ క్రమంలోనే దర్శకనిర్మాతల మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చి, కొత్త దర్శకులు చేరి బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేస్తుంటారు. భారీ ప్రాజెక్టుల విషయంలో అలాంటి అనుభవాలెన్నో ఉన్నాయి.
స్పైడర్ మేన్, డాన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, ఎక్స్ మేన్ వోల్వోరిన్ వంటి భారీ చిత్రాలకు దర్శకులు మారారన్న ప్రచారం అప్పట్లో సాగింది. కొన్నిటికి స్క్రిప్టు వర్క్ జరిగే దశలోనే దర్శకుల మార్పు ఉంటే, మరికొన్నిటికి అంతా అయిపోయాక మిడిల్ లో కొత్త దర్శకులు వచ్చి పూర్తి చేసిన సందర్భాలున్నాయి. డంకన్ జోన్స్ తీయాల్సిన `వార్ క్రాఫ్ట్` మూవీని మిడిల్ లో శామ్ రాయిమి డైరెక్ట్ చేశారు. అయితే అదే తరహా కల్చర్ ఇండియన్ సినిమా హిస్టరీలోనూ ఉందా? అంటే లేకపోలేదు. ఒక డైరెక్టర్ వదిలేసిన సినిమాని వేరొక దర్శకుడు చేపట్టి పూర్తి చేసిన సందర్భాలున్నాయి. ఇటీవలే బాలీవుడ్ లో లైంగిక వేధింపుల ఆరోపణలతో సాజిద్ ఖాన్ తప్పకుంటే `హౌస్ ఫుల్ 4` చిత్రాన్ని ఫర్హాద్ సామ్జీ టేకప్ చేయాల్సొచ్చింది.
ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో తేజ డ్రాప్ అయ్యాక క్రిష్ ప్రాజెక్టులో చేరారు. ఆయన దర్శకత్వంలోనే కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలు తెరకెక్కాయి. కథానాయకుడు రిలీజైంది. మహానాయకుడు రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక `మణికర్ణిక` విషయంలో క్రిష్ మెజారిటీ పార్ట్ తెరకెక్కించి తప్పుకుంటే, బ్యాలెన్స్ సినిమాని కంగన స్వయంగా ఆ డైరెక్ట్ చేసింది. క్రిష్ తీసిన చాలా సీన్లను కంగన పూర్తిగా మార్చేసిందని ప్రచారమైంది. అంతేకాదు 70 శాతం సీన్లు తాను తీసినవేనని కంగన ప్రచార కార్యక్రమాల్లో చెప్పుకుంది. స్క్రిప్టు మారిపోయింది.. పూర్తిగా కంగన చేతిలోకే అంతా వెళ్లిపోయింది. అందుకే నేడు రిలీజైన ఈ సినిమాని క్రిష్ వీక్షించి ఉంటారా? లేదా? అంటూ అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఒకవేళ క్రిష్ ఈ సినిమా చూసినా సీక్రెట్ గానే వాచ్ చేస్తాడంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. అంత పెద్ద ప్రాజెక్టును క్రిష్ వదులుకోవడాన్ని కొందరైతే తప్పు పడుతున్నారు. మొత్తానికి ఏం జరిగినా ప్రస్తుతం మణికర్ణిక దర్శకురాలిగా కంగన పేరు మార్మోగుతోంది. క్రిష్ కి నామమాత్రపు గుర్తింపు మాత్రమే దక్కుతోంది. ఇది అనూహ్య పరిణామం అనే చెప్పాలి.