Begin typing your search above and press return to search.
ఇదే హిట్ కాలేదు.. ఇంకా 2-3 పార్ట్స్ తీస్తారా..?
By: Tupaki Desk | 19 Nov 2022 2:30 AM GMTస్టార్ హీరోయిన్ సమంత టైటిల్ రోల్ లో నటించిన తాజా చిత్రం "యశోద". శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించారు. దర్శక ద్వయం హరి & హరీష్ తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. అయితే ఈ థ్రిల్లర్ చిత్రం ఆశించిన మేర బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించలేకపోయింది.
"యశోద" చిత్రానికి ఆడియెన్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. సమీక్షలు కూడా సానుకూలంగా రాలేదు. దీనికి తగ్గట్టుగానే కలెక్షన్స్ వచ్చాయి. మొదటి వారం ముగిసే సమయానికి వచ్చిన వసూళ్లను బట్టి చూస్తే.. సంతృప్తికర ఫలితం అందుకోలేకపోయిందనే చెప్పాలి. అలాంటిది ఇప్పుడు సమంత చిత్రానికి సీక్వెల్ చేసే ఆలోచన చేస్తున్నట్లు మేకర్స్ హింట్ ఇస్తున్నారు.
రీసెంట్ గా దర్శకులు హరి - హరీశ్ మాట్లాడుతూ.. "యశోద 2' విషయంలో తమ వద్ద ఓ ఆలోచన ఉన్నట్లు తెలిపారు. అంతేకాదు ఈ సినిమా మూడో బాగానికి కూడా ఓ లీడ్ ఉందనీ పేర్కోన్నారు. సమంత పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చిన తర్వాత ఆమెతో కథ గురించి చర్చిస్తామని.. తను ఒప్పుకుంటే వెంటనే సీక్వెల్స్ పట్టాలెక్కిస్తామని అన్నారు. దీనికి నిర్మాత కూడా సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
అయితే బాక్సాఫీసు వద్ద హిట్ అనిపించుకోని చిత్రానికి 2 - 3 భాగాలు చేయడమేంటని ఇప్పుడు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. "యశోద" సినిమాకి మొదటి నుంచే వసూళ్లు వీక్ గా ఉన్నాయి. ఎలాంటి పోటీ లేకుండా రిలీజ్ చేసినా.. ఓపెనింగ్స్ ఆశించిన విధంగా రాలేదు. వీక్ డేస్ లో అయితే ఆక్యుపెన్సీ మరీ దారుణంగా పడిపోయింది.
ట్రెండ్ చూస్తుంటే ఫైనల్ రన్ పూర్తయ్యే నాటికి "యశోద" కలెక్షన్స్ 14 కోట్లు లోపే ఉండేలా ఉన్నాయి. ఈ చిత్రానికి 40 కోట్ల వరకూ ఖర్చు చేసినట్లు నిర్మాత స్వయంగా వెల్లడించారు. అయితే 8 కోట్ల డెఫిషిట్ లో ఈ చిత్రాన్ని రిలేజ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు వసూళ్లు చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైనట్లే అనుకోవాలి.
అలాంటి చిత్రానికి సీక్వెల్ తీయడం ఏంటి? దానికి నిర్మాత రెడీగా ఉండటం ఏంటి? అనేది అర్థం కావటం లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సినిమా రిలీజై థియేటర్లలో సందడి చేస్తున్నప్పుడు ఇలా సీక్వెల్ గురించి మాట్లాడడం.. ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం అందరికీ మామూలు అయిపోయిందని వ్యగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.
పబ్లిసిటీ కోసమో.. సినిమా థియేట్రికల్ రన్ ను పెంచుకోడానికో దర్శకులు సీక్వెల్ అని ఓ మాట అని ఉంటారని.. "యశోద" సినిమాకి రెండు మూడు భాగాలు చేసి రిస్క్ చేయటానికి సమంత సైతం సిద్దంగా లేకపోవచ్చని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.