Begin typing your search above and press return to search.
టాప్ స్టోరి: డైలమాలో డైరెక్టర్స్
By: Tupaki Desk | 4 May 2019 7:05 AM GMTనవతరంలో ట్యాలెంటెడ్ దర్శకులకు కొదవేం లేదు. బయటికి కనిపించని కెప్టెన్లు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నారు. కథల పరంగా టాలీవుడ్ కొత్త ఫేజ్ లోకి ప్రవేశించిన ఈ క్రమంలో కొత్త పంథా స్క్రిప్టులతో ప్రయోగాలు చేస్తూ యువదర్శకులు ఆకట్టుకుంటున్నారు. ఇటీవల విడుదలైన మజిలీ.. జెర్సీ లాంటి చిత్రాలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఇలాంటి ట్యాలెంట్ ఫిలింనగర్ లో హిడెన్ గా ఇంకా ఎంతో ఉందనడంలో సందేహమేం లేదు. ఇకపోతే ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి తమని తాము నిరూపించుకుని ప్రస్తుతం సినిమా చేయకుండా ఎందరు దర్శకులు ఉన్నారు? అన్నది పరిశీలిస్తే... ఓ అరడజను మంది పేర్లు వెలుగులోకొచ్చాయి.
ఈరోజుల్లో.. ప్రేమకథా చిత్రమ్.. భలే భలే మగాడివోయ్ లాంటి చిత్రాలతో మారుతి పేరు మార్మోగిపోయింది. నవతరంలో ట్యాలెంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే నాగచైతన్య- శైలజా రెడ్డి అల్లుడు ఫ్లాపవ్వడంతో కొంత గ్యాప్ వచ్చింది. 2018-19 సీజన్ లో కొత్త ప్రాజెక్ట్ కన్ఫామ్ కాలేదు.. డెప్త్ ఉన్న స్క్రిప్టు రాస్తున్నానని మారుతి ఇటీవల సోషల్ మీడియాలో స్వయంగా డ్రా చేసిన ఓ పెయింటింగ్ ని పోస్ట్ చేశారు. ``ప్రస్తుత నా సన్నివేశంపై నేను అత్యంత వేగంగా గీసిన స్కెచ్ ఇది. స్క్రిప్టుని ఎంతో డెప్త్ తో రూపొందించే ప్రయత్నంలో ఉన్నాను`` అని వ్యాఖ్యను ఆ పెయింటింగ్ కి జోడించారు. అయితే ఈ స్క్రిప్టు ఎవరికోసం? అన్నది అధికారికంగా రివీల్ చేయలేదు ఇంకా. హీరో రామ్ తో మారుతి ఓ సినిమా చేస్తారని అప్పట్లో ప్రచారమైన సంగతి తెలిసిందే. ఇకపోతే బన్ని తో సినిమా చేసే ఆలోచన మారుతికి ఉందని చెప్పుకున్నారు. మరి తన లేటెస్ట్ స్క్రిప్ట్ ఎవరికోసం అన్నది ప్రకటిస్తారేమో వేచి చూడాలి.
మాస్ మహారాజా రవితేజ కోసం ఇద్దరు దర్శకులు వెయిటింగ్ లో ఉన్నారు. టైగర్ .. ఎక్కడికి పోతావు చిన్నవాడా? లాంటి చిత్రాలతో ఇటీవల వి.ఐ.ఆనంద్ పేరు మార్మోగింది. శిరీష్ హీరోగా అతడు తెరకెక్కించిన `ఒక్క క్షణం` విమర్శకుల ప్రశంసలు అందుకున్నా బాక్సాఫీస్ వద్ద ఫెయిలవ్వడంతో మరో సినిమా చేసేందుకు చాలానే వేచి చూడాల్సొచ్చింది. దర్శకుడు వి.ఐ.ఆనంద్ తదుపరి మాస్ మహారాజా హీరోగా `డిస్కో రాజా` చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. స్క్రిప్టు ఫైనల్ అయ్యిందని ఇటీవల వార్తలొచ్చినా అధికారికంగా సరైన సమాచారం లేదు. స్క్రిప్టు పరంగా రవితేజ భారీ కసరత్తులు చేయిస్తున్నారని తెలుస్తోంది. ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మరో ట్యాలెంటెడ్ దర్శకుడు
`కందిరీగ` ఫేం సంతోష్ శ్రీనివాస్ గత మూడు నాలుగేళ్లుగా కెరీర్ పరంగా కొంత డైలమాలో ఉన్నారు. అతడు ఓవైపు సినిమాటోగ్రాఫర్ గా బిజీగా ఉంటూనే దర్శకుడిగానూ తదుపరి సినిమా కోసం సన్నాహకాల్లోనే ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లడంతో మైత్రి సంస్థలో చేయాల్సిన సినిమా డైలమాలో పడింది. అటుపై మాస్ మహారాజా కథానాయకుడిగా తమిళ బ్లాక్ బస్టర్ `తేరి` రీమేక్ కోసం స్క్రిప్టును రెడీ చేశారు. కానీ రవితేజ- మైత్రి సంస్థ గత చిత్రం `అమర్ అక్బర్ ఆంటోనీ` ఫెయిల్యూర్ ప్రభావం అతడిపై పడింది. ప్రస్తుతం ఈ కాంబో హోల్డ్ లో ఉన్నారని తెలుస్తోంది.
కార్తికేయ.. ప్రేమమ్ లాంటి బ్లాక్ బస్టర్లు తీసిన ట్యాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి ప్రస్తుతం తదుపరి చిత్రం కోసం వెయిటింగ్ లో ఉన్నారు. నాగచైతన్య `సవ్యసాచి` బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో తదుపరి స్క్రిప్టు విషయమై ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారట. చందు ప్రస్తుతం స్క్రిప్టు పనిలోనే బిజీ.. కొత్త ప్రాజెక్ట్ ఏదీ ప్రకటించలేదు. పెళ్లి చూపులు లాంటి బ్లాక్ బస్టర్ తీసిన తరుణ్ భాస్కర్ వరుసగా ప్రయోగాలు చేశారు. కానీ ఆశించిన కమర్షియల్ సక్సెస్ దక్కలేదు. రిలీజ్ కి రెడీ అవుతున్న `ఫలక్ నుమా దాస్` చిత్రంలో పోలీస్ కానిస్టేబుల్ గా నటించిన సంగతి తెలిసిందే. తదుపరి స్వీయ దర్శకత్వంలో సినిమాకి తరుణ్ భాస్కర్ స్క్రిప్టులు రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. `అలా ఎలా` ఫేం అనీష్ కృష్ణకు రానా ఛాన్సిచ్చినా ఆ ప్రాజెక్టు ఇంకా సందిగ్ధంలోనే ఆపి ఉంచారు. మరో ట్యాలెంటెడ్ మాస్ డైరెక్టర్ సంపత్ నంది గోపిచంద్ తో `గౌతమ్ నంద` (2017) తెరకెక్కించారు. ఆ తర్వాత కొత్త సినిమాని ప్రకటించలేదు. నిర్మాతగా ఓ రెండు చిత్రాల్ని రిలీజ్ చేసిన సంగతి తెలసిందే. దర్శకుడిగా మాత్రం తదుపరి సినిమా ఏం చేస్తున్నారు.. అన్నది తెలియాల్సి ఉంది. ఇలాంటి సందిగ్ధావస్తలోనే మరికొందరు దర్శకులు ఉన్నారు. ప్రతి సినిమా మొదటి సినిమానే అనుకుని హిట్టు కొట్టాల్సిందే. లేదంటే ఇలా వెయిటింగ్ తప్పదనడానికి ఎగ్జాంపుల్స్ వీళ్లంతా.