Begin typing your search above and press return to search.
టైటిల్ ప్రకటన ఆపితే బాలయ్యకు హిట్ ఖాయమా?
By: Tupaki Desk | 11 Jun 2022 2:30 PM GMTనటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 'ఎన్‌బీకే 107' వర్కింగ్ టైటిల్ తో ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితం అవుతోంది. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంటే.. విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రను పోషిస్తోంది.
అలాగే బాలయ్య ను ఢీ కొట్టే విలన్ పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'జై బాలయ్య' అనే టైటిల్ ను ఖరారు చేశారని బలంగా టాక్ వినిపించింది. బాలయ్య బర్త్‌డేకు టైటిల్ ప్రకటన ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే మేకర్స్ ఆయన పుట్టినరోజు కానుకగా టీజర్ విడుదల చేశారు. కానీ, టైటిల్ ను మాత్రం ప్రకటించలేదు.
మరోవైపు బాలయ్య సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది తండ్రీకూతుళ్ల మధ్య సాగే యాక్షన్ ఎంటర్టైనర్ అని, ఇందులో బాలయ్య కూతురిగా శ్రీలీల అలరించబోతోందని ఇప్పటికే అనిల్ రావిపూడి స్పష్టం చేశారు. అలాగే సెప్టెంబర్ లో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లబోతోందని కూడా వెల్లడించారు. ఇక ఈ మూవీకి 'బ్రో..ఐ డోంట్ కేర్' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు గత కొద్ది రోజుల నుంచీ ప్రచారం జరుగుతోంది.
బాలయ్య బర్త్‌డే నాడు టైటిల్ పై స్పష్టత రానుందని అంతా భావించారు. కానీ, అనిల్ రావిపూడి సైతం టైటిల్ ను రివిల్ చేయకుండా 'ఎన్‌బీకే 108' వర్కింగ్ టైటిల్ తో సినిమాను అనౌన్స్ చేశారు. అయితే టైటిళ్ల ప్రకటన ఆపడం వెనుక బాలయ్య సెంటిమెంట్ ఉందంటూ ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు కొదవే లేదు. అందులోనూ బాలయ్య రకరకాల సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారు. ఇక ఈ టైటిళ్లను ఆపే సెంటిమెంట్ మాత్రం అఖండ సినిమాతోనే వచ్చిందట. అఖండ సినిమా టైటిల్ అంత త్వరగా బయటకు రాలేదు. సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందే టైటిల్ ను ప్రకటించారు. అప్పటి వరకు 'ఎన్‌బీకే 106' వర్కింగ్ టైటిల్ తోనే ప్రచారం చేశారు. కట్ చేస్తే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
టైటిల్ ప్రకటన ఆపితే హిట్ పడుతుందని బాలయ్య నమ్ముతున్నారట. ఈ నేపథ్యంలోనే తన తదుపరి చిత్రాలను 'ఎన్‌బీకే 107', 'ఎన్‌బీకే 108'లుగానే ప్రమోట్ చేయాలని, రిలీజ్ దగ్గర పడ్డాక టైటిల్స్ ను అనౌన్స్ చేయాలని బాలయ్య డైరెక్టర్లకు సూచించారట. అందుకే టైటిళ్ల ప్రకటన ఆపేశారంటూ ఇప్పుడో కొత్త ప్రచారం నెట్టింట వైరల్ గా మారింది.