Begin typing your search above and press return to search.
దిల్ రాజు పరిచయం చేసిన వారు ఇప్పుడు ఇండస్ట్రీని ఊపేస్తున్నారు
By: Tupaki Desk | 16 Jun 2020 11:30 PM GMTటాలీవుడ్ ప్రముఖ నిర్మాతల జాబితాలో దిల్ రాజు పేరు ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పటి నుండో పాతుకు పోయి ఉన్న నిర్మాతలకు పోటీగా సినిమాలు నిర్మించి ఎన్నో సూపర్ హిట్స్ ను అందుకున్న నిర్మాత దిల్‌రాజు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతల్లో అత్యధిక సక్సెస్ రేటు ఉన్న నిర్మాత దిల్‌రాజు. ఈయన దరిదాపుల్లో కూడా ఎవరు ఉండరు అనడంలో సందేహం లేదు. కొత్త వారిని ప్రోత్సహించి వారి నుండి అద్బుతమైన సినిమాలను రాబట్టగల నిర్మాత దిల్‌రాజు కొత్త వారిని ఎక్కువగా పరిచయం చేసిన దిల్‌రాజు ఇండస్ట్రీకి మేటి దర్శకులను అందించాడు.
దిల్ రాజు బ్యానర్‌లో పరిచయం అయిన పలువురు దర్శకులు ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్‌గా ఉన్నారు. ముఖ్యంగా దిల్ రాజు పరిచయం చేసిన సుకుమార్, బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి, వివి వినాయక్ ఇంకా పలువురు దర్శకులు స్టార్ హీరోలతో సూపర్ స్టార్ హీరోలతో సినిమాలను తెరకెక్కించి ఇండస్ట్రీ హిట్ కొట్టారు.
సుకుమార్ సినిమా ఛాన్స్ ల కోసం స్ట్రగుల్ అవుతున్న సమయంలో దిల్ రాజు ఆయనపై నమ్మకం ఉంచి ఆర్య చిత్రాన్ని బన్నీతో నిర్మించాడు. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. సుకుమార్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ దర్శకుల జాబితాలో ముందు ఉంటాడు. భద్ర సినిమాతో బోయపాటి శ్రీనును దర్శకుడిగా పరిచయం చేశాడు దిల్ రాజు. బోయపాటి కూడా ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా వెలుగు వెలుగుతున్నాడు. యాక్షన్ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్ అనిపించుకున్న వివి వినాయక్‌ను ఆది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది దిల్ రాజు అనే విషయం తెల్సిందే. ఈమద్య కాస్త డల్ అయినా వినాయక్ ఒకప్పుడు ఏ రేంజ్ సినిమాలు చేశాడో తెల్సిందే.
మున్న సినిమాతో వంశీ పైడిపల్లిని దర్శకుడిగా దిల్‌రాజు పరిచయం చేశాడు. ఆ తర్వాత వరుసగా రెండు సినిమాలను కూడా దిల్ రాజు బ్యానర్‌లోనే ఈయన తెరకెక్కించాడు. మహేష్‌తో మహర్షి తెరకెక్కించి భారీ విజయాన్ని ఈయన సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. బొమ్మరిల్లు వంటి సన్షేషనల్ సక్సెస్ దక్కించుకున్న సినిమాతో భాస్కర్‌ను దిల్‌రాజు తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. కొత్త బంగారు లోకం చిత్రంతో శ్రీకాంత్ అడ్డాలను, జోష్ చిత్రంతో వాసు వర్మను, మరో చరిత్ర చిత్రంతో రవి యాదవ్‌ను, ఓ మై ఫ్రెండ్ చిత్రంతో వేణు శ్రీరామ్ ను దర్శకుడిగా పరిచయం చేసిన ఘనత దిల్ రాజుకు దక్కింది.
ఇక నాగచైతన్యను తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం చేసింది కూడా దిల్ రాజు అనే విషయం తెల్సిందే. వరుస సక్సెస్ ల ఉన్న నిర్మాత దిల్ రాజు పై నమ్మకంతో నాగార్జున నాగచైతన్య బాధ్యతలు అప్పగించాడు. అయితే చైతూను శివ రేంజ్ సినిమాతో పరిచయం చేయాలని భావించిన దిల్ రాజు నిరాశ పర్చాడు. కాని ఎప్పటికి అయినా చైతూకు ఒక సూపర్ హిట్ ఇవ్వాలనే పట్టుదలతో మాత్రం దిల్ రాజు ఉన్నట్లుగా తెలుస్తోంది.