Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: బాలన్ గారి బోల్డ్ అవతారం!

By:  Tupaki Desk   |   30 Jan 2019 5:50 AM GMT
ఫోటో స్టొరీ: బాలన్ గారి బోల్డ్ అవతారం!
X
డబూ రత్నాని క్యాలెండర్ తెలుసు కదా. బాలీవుడ్ లో ఫేమస్ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అయిన డబూ గత ఇరవై ఏళ్ళుగా ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్ విడుదల చేస్తాడు. ఆ క్యాలెండర్ కోసం ప్రతి ఏడాది హాట్ బ్యూటీలను వెతికి మరీ ఫోటోలు తీస్తాడు. వారిని తన క్యాలెండర్ బ్యూటీలుగా మార్చేస్తాడు. ఆ ట్రెండ్ ను ఈ ఏడాదికూడా కంటిన్యూ చేస్తూ 2019 క్యాలెండర్ విడుదల చేశాడు.

ఇప్పటికే ఈ క్యాలెండర్ లో చోటు సంపంధించిన లస్ట్ భామ కియారా అద్వాని మహా హాటుగా అందరినీ మెప్పించింది. కియారా ఒక నెలకే కదా. మరో 11 నెలలు ఉన్నాయి. అందులో మరో నెల కోసం సీనియర్ బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ ను తీసుకున్నాడు. సీనియర్ కదా.. పెళ్లైంది కదా.. ఈమధ్యే డీసెంట్ గా ఎన్టీఆర్ సతీమణి బసవతారకం గారి పాత్రలో నటించింది కదా.. అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఈ క్యాలెండర్ కోసం తన మాసును బయటకు తీసింది. డబూ కోసం మరో డర్టీ పిక్చర్ లాంటి పోజిచ్చింది.

సీనియర్ బ్యూటీ కదా.. అందాలు ఆరబోయడం ఆమెకు కొత్తేమీ కాదు. అలవోకగా తన క్లీవేజ్ సోకులను క్యాలెండర్ కోసం మొహమాటం లేకుండా వడ్డించింది. విద్యా బాలన్ కు 40 ఏళ్ళు.. ఈ వయసులో ఏంటి డర్టీ పిక్చర్లని సంప్రదాయవాదులు చిరాకు పడి పరాకుమాటలు మాట్లాడతారేమో.. అలాంటి వారు డబూ రత్నాని క్యాలెండర్ బదులు వేరే సాంప్రదాయ క్యాలెండర్ ను చూసుకుంటే సరిపోతుంది!