Begin typing your search above and press return to search.

యూఎస్ లో ఈ వీకెండ్ నిరాశే

By:  Tupaki Desk   |   3 Jun 2017 5:15 AM GMT
యూఎస్ లో ఈ వీకెండ్ నిరాశే
X
టాలీవుడ్ సినిమాలకు యూఎస్ బాక్సాఫీస్ ఓ ప్రధానమైన జోనర్ అయిపోయింది. సినిమా సరిగా పడాలే కానీ.. ఓ చిన్న సినిమా ఖర్చులన్నీ ఇక్కడి నుంచి రాబట్టేయచ్చనే స్థాయిలో వసూళ్లను కురిపించే ఏరియా అయిపోయింది. బాహుబలి2 తర్వాత వరుసగా లో-మీడియం బడ్జెట్ సినిమాలు వస్తున్నా.. ఈ వారాంతం మాత్రం యూఎస్ బాక్సాఫీస్ మరీ డల్ గా సాగనుందని ట్రేడ్ జనాలు అంటున్నారు.

ఈ శుక్రవారం రిలీజ్ అయిన ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్.. అంధగాడు చిత్రాలు నిరాశ కలిగించాయి. తొలి రోజున అంధగాడు కేవలం 1000డాలర్లు మాత్రమే రాబట్టింది. ఫ్యాషన్ డిజైనర్ అయితే 574 డాలర్లకు పరిమితం అయిపోయింది. గురువారం ప్రీమియర్స్ ద్వారా అంధగాడికి 19 లొకేషన్స్ నుంచి 1250 డాలర్లు వస్తే.. ఫ్యాషన్ డిజైనర్ ముూవీ 25 లొకేషన్స్ నుంచి 930 డాలర్లను రాబట్టగలిగింది. రెండు సినిమాలకు టాక్ యావరేజ్ గా ఉండడంతో.. శుక్రవారానికి వీటి స్థాయి మరింతగా పడిపోయింది.

అయితే.. శుక్రవారం రోజున నాగచైతన్య మూవీ రారండోయ్ వేడుకచూద్దాం 10382 డాలర్లను వసూలు చేయగలిగింది. అయితే.. ఈ మూవీ లోకల్ గా హిట్ రేంజ్ కి దూసుకుపోతున్నా.. యూఎస్ బాక్సాఫీస్ లో ఫెయిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 8 లక్షల డాలర్లు వసూలు చేస్తే కానీ బ్రేక్ఈవెన్ వచ్చే అవకాశం లేకపోవడంతో.. డిస్ట్రిబ్యూటర్లకు 25 శాతం నష్టం వాటిల్లే ఛాన్స్ కనిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/