Begin typing your search above and press return to search.

​ఈ సినిమాలతో గడిపేది ఎలా బాస్?

By:  Tupaki Desk   |   17 Jun 2017 1:10 PM GMT
​ఈ సినిమాలతో గడిపేది ఎలా బాస్?
X
శుక్రవారం వచ్చింది అంటే సినిమా నిర్మించిన వాళ్లు పరీక్ష ఫలితాల కోసం భయపడుతూ ఎదురుచూస్తున్న విధ్యార్దిలా ఉంటారు. అదే ప్రేక్షకుడు అయితే సెలవులు వచ్చాయి అనే ఆనందంతో ఊరంతా తిరిగే పిల్లాడులాగా తిరుగుతాడు. అటువంటి ప్రేక్షకులుకు ఈ వారం విడుదలైన సినిమాలు కాస్త నిరాశపరిచాయి. ఈ వారం ఒకటి రెండు కాదు మొత్తం ఐదు సినిమాలు విడుదల అయ్యాయి. దీనితో వీకెండ్ అందరూ బాగానే ప్లాన్ చేసుకున్నారు సినిమాలు చూడటానికి.

త్రికోణ ప్రేమ కథ అని చాటింపు వేసి పోస్టర్ తో కూల్ గా ప్రచారం చేసిన ‘కాదలి’లో కూడా కొత్త విషయం ఏమీ లేదనేది పబ్లిక్ టాక్. యాంకర్ లాస్య లీడ్ లో వచ్చిన ‘రాజా మీరు కేక’ సినిమా కూడా ఆకట్టుకోలేకపోయింది. ‘పెళ్ళికి ముందు ప్రేమ కథ’ సినిమా పూర్తిగా నీరసపరిచింది. 'అవంతిక' అనే హారర్ కామెడీ సినిమా వైపు కుడా ఎవరు వెళ్ళటం లేదు. ఆది పినిశెట్టి నటించిన ‘మరకతమణి’ మాత్రం ఏదో ఆది ఉండటం వలన కొంత నెట్టుకువస్తుంది అని చెబుతున్నారు. మొత్తాని శుక్రవారం విడుదలైన ఒక్క సినిమా కూడా బాక్స్ ఆఫీసు వద్ద కనీసంగా ఇంప్రెస్ చేయకపోవడం ప్రేక్షకులు సినిమా తీసినవాళ్లు ఇద్దరు ఈ వీకెండ్ దీనంగా గడపవలిసి వస్తోంది. మరి ఆదివారం ఏమైనా పుంజుకుంటుందేమో చూద్దాం.

కిందటి నెల విడుదలైన బాహుబలి కి ఇప్పటికీ మంచి కలెక్షన్లు వస్తున్నాయి. రా రాండోయ్ వేడుక చూద్దాం, అమీ తుమీ సినిమాలు ఈ గ్యాప్ ను క్యాష్‌ చేసుకుంటూ నాలుగు టిక్కెట్లు ఎక్కువ తెగేలా చేసుకుంటున్నాయి. ఈ వారం కొత్త సినిమాలు చేయవలిసిన బిజినెస్ కూడా పాతవాటి వైపు మొగ్గుచూపాయి అన్నమాట. మన తెలుగులో పులిహోర - పుల్లట్లు ఇందుకే ఫేమస్ మరి. ఇక వీటితో వచ్చే వారం వరకు గడిపేది ఎలా బాస్?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/