Begin typing your search above and press return to search.
ఓటీటీ ఫ్యాన్స్ కిది నిజంగా డిజాస్టర్స్ వీకెండ్
By: Tupaki Desk | 12 March 2022 12:31 PM GMTథియేటర్లలో క్లిక్కయిన సినిమాలు నెల రోజులు తిరిక్కుండానే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ఓటీటీల్లో ప్రత్యక్షమవుతున్న విషయం తెలిసిందే. ఈ సారి కూడా నాలుగైదు చిత్రాలు ఓటీటీ వేదికలపై పోటీపడ్డాయి. ఇందులో తెలుగు చిత్రాలతో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా వున్నాయి.
అయితే ఈ వీకెండ్ ఓటీటీలో విడుదలైన సినిమాలు ఫ్యాన్స్ కి డిజాస్టర్స్ వీకెండ్ గా మార్చాయి. వెండితెరపై భారీ అంచనాల మధ్య రిలీజై ఆకట్టుకోలేకపోయిన సినిమాలు తాజాగా ఓటీటీలో విడుదలయ్యాయి.
అలా థియేటర్లలో విడుదలై ఆకట్టుకోలేక పోయిన చిత్రాలు రెండు. ఈ రెండూ తెలుగు చిత్రాలే. మరో రెండు తమిళ అనువాద చిత్రాలు. ఇందులో ముందుగా మాస్ మహారాజా రవితేజ నటించిన `ఖిలాడీ` చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
మార్చి 11న ఈ చిత్రం స్ట్రీమింగ్ మొదలైంది. థియేటర్లలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఫ్యాన్స్ ని నిరుత్సాహ పరిచింది.
ఈ మూవీ తరువాత దిల్ రాజు నిర్మించిన `రౌడీ బాయ్స్` జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు హీరోగా పరిచయం అయిన ఈ మూవీ పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయింది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది.
ఇక ఈ రెండు చిత్రాలతో పాటు ఈ వీకెండ్ లో ప్రేక్షకుల ముందుకొచ్చిన తమిళ అనువాద చిత్రాలు మారన్. క్లాప్. ఈ రెండు చిత్రాలూ డైరెక్ట్ గా ఓటీటీలోనే విడుదలయ్యాయి. ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్ నటించిన స్పోర్ట్స్ డ్రామా `క్లాప్`. సోనీలీవ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ పరిస్థితి కూడా అంతే. ముందు గుడ్ టాక్ వినిపించినా రిలీజ్ తరువాత మాత్రం ఏ మాత్రం ఆకట్టుకోలేకనోయింది.
ఇక ఇదే సినిమాతో పోటీపడుతూ విడుదలైన చిత్రం `మారన్`. ధనుష్ హీరోగా నటించిన ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైంది. ధనుష్ పవర్ ఫుల్ జర్నిలిస్టుగా నటించారు. ఓటీటీలలో విడుదలైన ఈ నాలుగు చిత్రాలు డిజాస్టర్ లు కావడంతో ఆడియన్స్ ఇది డిజాస్టర్ ల వీకెండ్ అంటున్నారట.