Begin typing your search above and press return to search.

అవకాశాలు లేనప్పుడు బంగ్లా కట్టుకున్నా

By:  Tupaki Desk   |   27 Sep 2017 11:24 AM GMT
అవకాశాలు లేనప్పుడు బంగ్లా కట్టుకున్నా
X
సాధారణంగా ప్రతి హీరో ఒక్కసారైనా తన లైఫ్ లో భారీ బడ్జెట్ సినిమాలను తీయాలని అనుకుంటాడు. అయితే అలాంటి సినిమాను తీయాలంటే ఆ హీరో ప్రతి సినిమాకి మార్కెట్ ను పెంచుకుంటూ ఉండాలి. ఇక ఏ మాత్రం వరుసగా అపజయాలు వచ్చినా హీరో కెరీర్ ప్రశ్నార్థకంగా మారడం ఖాయమని చెప్పాలి. అయితే కొందరు హీరోలు మాత్రం ఎన్ని అపజయాలు వచ్చినా ఒక్క సినిమాతో ఊహించని స్థాయికి వెళతారు. అయితే అదే తరహాలో తనకు అపజయం వచ్చిన ప్రతి సారి మార్కెట్ వాల్యూ పెరిగిందని మహేష్ అంటున్నాడు.

స్పైడర్ సినిమా కోసం రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ ఈ విషయాన్ని చెప్పాడు. అసలు నాకు ఇంత మార్కెట్ ఎలా వచ్చిందో అస్సలు అర్ధం కాలేదని అంతే కాకుండా చేతిలో ఒక్క సినిమా లేనప్పుడు కూడా ఇల్లు కట్టుకున్నానని మహేష్ చెప్పడం అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే సినిమాలు లేని సమయంలో ఎక్కువగా యాడ్స్ రూపంలో రెమ్యునరేషన్ వచ్చేదని వివరించాడు. ఇక పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మూడేళ్ళ వరకు ఒక్క సినిమాను రిలీజ్ చేయలేదు కానీ 12 యాడ్స్ లో నటించానని చెప్పాడు.

ఈ స్థాయిలో యాడ్స్ ఎవ్వరు చేయలేదు. ఆ వచ్చిన డబ్బుతో ఒక బంగ్లా కట్టుకున్ననని కూడా చెప్పాడు. ఇక బ్రహ్మోత్సవం లాంటి డిజాస్టర్ తర్వాత స్పైడర్ సినిమా చేశాను.. కానీ ఈ సినిమా 150 కోట్ల రూపాయల ప్రీ - రిలీజ్ బిజినెస్ ఎలా జరిగిందో తనకు అర్ధం కాలేదని వివరించాడు. మొత్తంగా అపజయం వచ్చిన ప్రతి సారి చేతిలో ఒక్క సినిమా లేకున్నా కోట్ల రూపాయలను సంపాదించానని మహేష్ తెలిపాడు.