Begin typing your search above and press return to search.
డిస్కో రాజా ఫిక్స్ అయ్యాడా
By: Tupaki Desk | 28 Aug 2019 5:09 AM GMTమాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా డిస్కో రాజా షూటింగ్ నిర్విరామంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీకి రిలీజ్ డేట్ లాక్ చేసినట్టుగా విశ్వసనీయ సమాచారం. డిసెంబర్ 20న భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు డిసైడ్ అయినట్టుగా తెలిసింది. అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే రావొచ్చు. ఇటీవలే రవితేజ లుక్స్ కి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.
వయసు బాగా తగ్గిపోయిన పాత్రలో రవితేజ అవతారం చూసి అందరూ షాక్ తిన్నారు. అవి ఒరిజినలా కదా అనే విషయం పక్కన పెడితే మొత్తానికి టైం పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న డిస్కో రాజాను రవితేజ పాత్ర డిఫరెంట్ షేడ్స్ తో ఉంటుందన్న న్యూస్ అయితే ఉంది. ఇప్పుడు ఫిక్స్ అయిన డిసెంబర్ 20 డేట్ మంచి రీజనబుల్ బెట్ అని చెప్పొచ్చు. ఎలాగూ అక్కడి నుంచి సంక్రాంతి సీజన్ కు 20 రోజుల గ్యాప్ ఉంటుంది.
ఈలోగా డిస్కో రాజా తన పని పూర్తి చేసేస్తాడు. గత ఏడాది మూడు సినిమా ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో రవితేజ ఈ సంవత్సరం గ్యాప్ తీసుకుని మరీ డిస్కో రాజా చేశాడు. షూటింగ్ విషయంలో కొంత జాప్యం జరిగినప్పటికీ అవుట్ ఫుట్ క్వాలిటీ కోసమే లేట్ చేయక తప్పలేదని ఇన్ సైడ్ టాక్. ఇప్పటికైతే డిసెంబర్ లో కొత్త సినిమాలు ఏవి రాబోతున్నాయనే క్లారిటీ లేదు కాబట్టి ఫస్ట్ కర్చీఫ్ వేసిన మూవీ డిస్కో రాజానే అవుతుంది. చూద్దాం ఈ ప్రకటన వచ్చాక ఇంకెందరు షెడ్యూల్ చేస్తారో