Begin typing your search above and press return to search.
డిస్కో ఆడించే మ్యూజిక్ ఇస్తాడా?
By: Tupaki Desk | 8 Oct 2019 3:58 AMమాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా `డిస్కో రాజా` ఆన్ సెట్స్ ఉన్న సంగతి తెలిసిందే. వీఐ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై `చుట్టాలబ్బాయి` ఫేం రామ్ తళ్ళూరి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 20న సినిమా విడుదల కానుంది. ఇదివరకూ రిలీజ్ చేసిన రవితేజ పోస్టర్లకు అద్భుత స్పందన వచ్చింది.
సైన్స్ ఫిక్షన్ .. యాక్షన్ ఎంటర్ టైనర్ నేపథ్యంలో ప్రయోగాత్మక చిత్రమిది. మాస్ రాజాకి ఇది పూర్తిగా కొత్త జోనర్ అని చెబుతున్నారు. హైదరాబాద్-గోవా-న్యూడిల్లీలో కీలక షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. విజయదశమిని పురస్కరించుకుని.. డిస్కో రాజా తొలి సింగిల్ ని ఈనెల 19న విడుదల చేయనున్నామని తాజాగా చిత్రయూనిట్ ప్రకటించింది.
పాయల్ రాజ్ పుత్- తాన్యా హోప్-నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ముగ్గురు భామలు ఇచ్చే ట్రీట్ స్పెషల్ గా ఉంటుందని చిత్రయూనిట్ చెబుతోంది. ఈ సినిమాలో నభా నటేష్ గ్లామర్ మరో లెవల్లో ఉంటుందట.