Begin typing your search above and press return to search.
బావ పోయాడు పిల్లల కోసం ఉన్నాను
By: Tupaki Desk | 9 Aug 2017 8:48 AM GMTనాలుగేళ్ళ కిందట ఒక తెలుగు సినిమా ఫ్యామిలి లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆ ఇంటికి కొండంత అండ మట్టిలో కలిసిపోయింది. ఈ మనిషి ఆ ఇంటినే కాదు తెలుగు సినిమాను తెలుగు అభిమానులను కూడా తీవ్ర దుఖంలో మిగిలిచ్చిపోయాడు. రియల్ స్టార్ శ్రీహరి అంటే తెలుగు సినిమాలలో మంచి నటుడు గా గుర్తింపు ఉంది. విలన్ గా చిన్న కారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ హీరోగా మారాడు. శ్రీహరి మరణం తరువాత అతని భార్య డిస్కో శాంతి జీవితం మీద ఆశలు వదులుకొని మందుకు బానిస అయ్యారట. కానీ తన పిల్లలు భవిష్యత్ కోసం అన్నీ మానుకొని దైవ చింతనతో గడుపుతున్నట్టు ఒక మీడియా ఇంటర్వ్యూ లో తన భావాలను ఇలా చెబుతున్నారు.
డిస్కో శాంతి కి ఇప్పుడు తన ఇద్దరి పిల్లలే ప్రపంచం. శాంతి ఇద్దరి అబ్బాయిలు కూడా వాళ్ళ చదువు పూర్తి చేసుకోబోతున్నారు. ఆమె తన భర్త శ్రీహరి గురించి చెబుతూ. “దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం ఏదైనా ఉంది అంటే అది నా బావ శ్రీహరి నే. నన్ను ఎంతగానో ప్రేమించాడు. నా జీవితంలో దేవుడు ఎవరైనా ఉంటే అది మా బావ అనే చెబుతాను. శ్రీ హరిని పెళ్లి చేసుకున్నాక నా జీవితం స్వర్గంలా మారింది. కానీ నా తలరాత ఇలా ఉంది అని తలుచుకొని భాదపడుతున్నాను. శ్రీ హరి గారు చాలా కష్టపడి ఇండస్ట్రిలో ఒక స్టార్ గా ఎదిగారు. ఆయన దగ్గరకు వచ్చి ఎవరు సాయం అడిగినా లేదనేవారు కాదు. చనిపోయిన మా పాప జ్ఞాపకంగా అక్షర పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి మేడ్చల్ మండలంలోని నాలుగు ఊళ్లలోని స్కూళ్లకు ఫ్లోరైడ్ ఫ్రీ వాటర్ సదుపాయం కల్పించాడు. ఇప్పుడు తన పుట్టిన రోజు ఈ నెల 15 న వస్తుంది శ్రీ హరి చేయాలి అనుకునే సేవ కార్యక్రమాలు అన్నీ నేను చేస్తాను'' అంటూ సెలవిచ్చారు.
ఇంకా తన పిల్లలు గురించి చెబుతూ “మా పెద్దవాడు చదువు పూర్తి అయ్యింది మా రెండో వాడు ఇంకా చదువుతున్నాడు. అసలు నేను జీవిస్తున్నదే వాళ్ళ కోసం లేకపోతే శ్రీ హరి తోనే నేను చచ్చిపోయి ఉండవలిసింది. వాళ్ళు భవిష్యత్‌లో స్థిరపడతారు అనే నమ్మకం వచ్చిన తరువాత నేను ఏమై పోయాన పర్వాలేదు'' అని దైర్యంగా చెబుతున్నారు. పిల్లలు కోసం జీవిస్తూ నిత్యం శ్రీ హరి జ్జాపకాలతో ప్రపంచాన్ని మరిచి బతుకుతున్నారు శాంతి.