Begin typing your search above and press return to search.

ఆ టాప్‌ హీరోయిన్‌ మృతిపై మళ్లీ చర్చ

By:  Tupaki Desk   |   26 Feb 2019 6:11 AM GMT
ఆ టాప్‌ హీరోయిన్‌ మృతిపై మళ్లీ చర్చ
X
18 ఏళ్ల వయసుకే హిందీ, తెలుగు, తమిళంలో స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకున్న ముద్దుగుమ్మ దివ్య భారతి 19వ ఏటనే మృతి చెందిన విషయం తెల్సిందే. ద్యివ భారతి ఆత్మహత్య చేసుకుందని, ఎవరో ఆమెను కిందకు తోసేశారని మరికొందరు ఆమె బాగా తాగి కింద పడి చనిపోయిందని ప్రచారం జరిగింది. ఆ సమయంలో మీడియా అంత బలంగా లేని కారణంగా అసలు విషయాలు బయటకు రాలేదు. ఆమె చనిపోయిన ఇన్నాళ్లకు ఒక జాతీయ మీడియా సంస్థ ఆమె మరణంపై ఒక కథనంను రాసింది.

ఫిబ్రవరి 25న దివ్యభారతి జన్మదినం సందర్బంగా ఆమెపై సదరు మీడియా సంస్థ కథనంను వెళ్లడించింది. కథనంలో పలు ఆసక్తికర విషయాలను పేర్కొనడం జరిగింది. చనిపోయిన రోజు ఏం జరిగింది, చనిపోవడానికి ముందు ఆమె ఎవరితో మాట్లాడింది అనే విషయాలను కథనంలో పేర్కొనడం జరిగింది. దివ్య భారతి తండ్రి మాట్లాడుతూ తన కూతురు ఆత్మ హత్య చేసుకోలేదని, ఆమెది ప్రమాదవశాత్తు మరణం అంటూ చెప్పుకొచ్చాడు.

మీడియా సంస్థ కథనం ప్రకారం ఆరోజు ఏం జరిగిందంటే.. చెన్నైలో షూటింగ్‌ ముగించుకుని దివ్య భారతి ఆ రోజు ముంబయిలోని తన అపార్ట్‌ మెంట్‌ కు చేరుకుంది. ఆమె వెళ్లిన కొద్ది సమయానికే నీతా లుల్లా నుండి ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఒక సినిమా కాస్ట్యూమ్స్‌ గురించి చర్చించేందుకు దివ్య భారతి ఇంటికి నీతా లుల్లా ఆమె భర్తతో కలిసి వెళ్లింది. ఇద్దరు కూడా ఆ విషయాలను చర్చించారు. ఆ తర్వాత మందు పార్టీ చేసుకున్నారు. పార్టీని ఎంజాయ్‌ చేస్తూ, వంట మనిషి తీసుకు వచ్చిన స్నాక్స్‌ కూడా తిన్నారు.

అర్థ గంట తర్వాత బాల్కానీ వద్దకు వెళ్లి దివ్యభారతి కూర్చుంది. ఆమె ప్రమాదవశాత్తు అక్కడ నుండి జారి పడిందట. అపార్ట్‌ మెంట్‌ మొత్తంలో దివ్య భారతి ఉండే ప్లాట్‌ కు మాత్రమే బాల్కనీలో గ్రిల్స్‌ లేవట. ఒకవేళ గ్రిల్స్‌ ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. మొత్తానికి అతి చిన్న వయసులోనే స్టార్‌ గా ఎదికి, అంతే చిన్న వయసులో మృతి చెందిన దివ్య భారతి ఇతర హీరోయిన్స్‌ కు ఆదర్శంగా చెప్పుకోవచ్చు.