Begin typing your search above and press return to search.

ధైర్యం కోసం చెప్పుకున్న మాట సినిమా టైటిట్ గా మారిందట

By:  Tupaki Desk   |   26 Dec 2021 4:44 PM GMT
ధైర్యం కోసం చెప్పుకున్న మాట సినిమా టైటిట్ గా మారిందట
X
కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. పాత సంవత్సరం చివర్లో.. కొత్త సంవత్సరం చివర్లో కొన్ని సినిమాలు వస్తుంటాయి. సంక్రాంతి ముందుగా విడుదలయ్యే  ఈ సినిమాల విజయాల మీద.. కొత్త ఏడాది అంతా ఎలా ఉంటుందన్న అంచనాల్ని కొందరు వేసుకుంటూ ఉంటారు. కొత్త సంవత్సరం ఆరంభం బాగుంటే.. ఆ పాజిటివ్ వేవ్స్ ఏడాది మొత్తం ఉంటాయని నమ్మే వారు లేకపోలేదు. ఈ ఏడాది చివర్లో వస్తున్న సినిమాల్లో అందరిని ఆకర్షిస్తున్న మూవీ.. ‘అర్జుణ ఫల్గుణ’.  విలక్షణ నటుడు శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ మూవీకి దర్శకుడిగా తేజ మార్ని వ్యవహరిస్తే.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

సినిమా ఏదైనా సరే.. దిల్ రాజు ఓకే చేస్తే దాని ఇమేజ్ అప్పటివరకున్న దానికి భిన్నంగా ఉంటుంది. అర్జుణ ఫల్గుణ విషయంలోనూ అదే జరిగింది.  ఈ ఏడాది చివర్లో వస్తున్న ఈ మూవీని మొదట్లో సంక్రాంతి సందర్భంగా థియేటర్లోకి తీసుకొద్దామని భావించారు. కానీ.. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సందడితో తమ సినిమా కనిపించదన్న ఆలోచనతో ఆ మూవీ కంటే ముందే తీసుకొచ్చారు. ఈ సినిమా టైటిల్ రోటీన్ కు భిన్నంగా ఉందంటే.. దాని వెనుకో ఆసక్తికర కారణం ఉందని వివరించారు చిత్ర దర్శకులు.

తొలుత ఈ సినిమాను తూర్పుగోదావరి జిల్లాలో ఫేమస్ అయిన ఒక కూల్ డ్రింగ్ పేరును టైటిల్ గా అనుకున్నారట. కానీ.. దానికి అనుమతి రాలేదు. తాము అనుకున్న టైటిల్ రాకుంటే.. సినిమా కథ మార్చాల్సి పరిస్థితి. ఇలాంటి వేళలో.. సినిమా హీరో.. దర్శకుడు ఇదే అంశంపై చర్చించుకునే వేలలో.. అర్జుణ ఫల్గుణ అంటే ధైర్యం వస్తుందన్న మాట తమ సంబాషణలో వచ్చిందని.. చివరకు అదే టైటిల్ గా పెడితే బాగుంటుందని ఫిక్సు అయినట్లు చెప్పారు. అలా.. తాము అనుకున్న టైటిల్ కు భిన్నంగా.. తమ మాటల్లో నుంచే పుట్టినట్లు చెప్పారు.

సిటీలో ఉండి ఎంత సంపాదించినా మిగిలేది కొంతే. కానీ.. ఊళ్లో ఉండి సంపాదిస్తే ఎక్కువ మిగులుతుందని భావించే ఊరి కుర్రాళ్ల కథగా దీన్ని చెబుతున్నారు. ఫీల్ గుడ్ మూవీగా భావిస్తున్న ఈ మూవీకి హీరో శ్రీక్రిష్ణ ఒక అస్సెట్. మరి.. ఈ వారంలో వచ్చే ఈ సినిమా ఎలా ఉంటుందో ఈ వారాంతం తేలనుంది.