Begin typing your search above and press return to search.

కేన్స్‌ లో మన దీపిక మాటలపై చర్చ

By:  Tupaki Desk   |   19 May 2022 11:30 AM GMT
కేన్స్‌ లో మన దీపిక మాటలపై చర్చ
X
ఫ్రాన్స్ లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్‌ ఫెస్టివల్ లో ఇండియన్‌ సినీ తారలు సందడి చేశారు. ఈసారి సౌత్ ఇండియన్ ఫిల్మ్ స్టార్స్ కూడా పాల్గొనడం ప్రత్యేక విషయంగా చెప్పుకోవచ్చు. పూజా హెగ్డే తో పాటు ఇంకా పలువురు బాలీవుడ్‌ స్టార్స్ కు కేన్స్ ఫిల్మ్‌ ఫెస్టిల్‌ లో మాట్లాడే అవకాశం దక్కింది. ఆ సందర్బంగా ఇండియన్ సినిమా గురించి కేన్స్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో మన తారలు మాట్లాడారు.

బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్ దీపిక పదుకునే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సందడి చేసింది. తన డ్రస్‌ తో చూపరులను ఆకట్టుకోవడంతో పాటు తన మాటలతో అందరిలో చర్చనీయాంశంగా మారింది. ఈమద్య కాలంలో థియేట్రికల్‌ సినిమాలకు ఆధరణ తగ్గుతుంది అంటూ చర్చ మొదలయ్యింది. భవిష్యత్తులో ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్న సమయంలో దీపిక ఆ విషయమై మాట్లాడింది.

కేన్స్ లో మీడియా సమావేశంలో దీపిక పాల్గొన్న సమయంలో కరోనా కారణంగా ఓటీటీ లకు ఆధరణ విపరీతంగా పెరిగింది కదా.. ఇది థియేట్రికల్‌ రిలీజ్ సినిమాలపై ఎంత వరకు ప్రభావం ఉంటుందని మీరు భావిస్తున్నారు అంటూ ప్రశ్నించగా ఆ సమయంలో దీపిక స్పందిస్తూ... ప్రేక్షకులు రెండు రకాలుగా ఉంటారు.

కొందరు థియేటర్ లో అయితేనే సినిమా చూడాలి అనుకుంటారు. కొందరు బయటకు వెళ్లడానికి ఆసక్తి చూపించకుండా ఇంట్లోనే సినిమాలను ఆస్వాదిస్తారు.

ప్రపంచ వ్యాప్తంగా అన్ని చోట్ల రెండు రకాల ప్రేక్షకులు ఉన్నారు. కనుక ఓటీటీ వల్ల థియేట్రికల్‌ సినిమాలకు వచ్చిన నష్టం ఏమీ ఉండదు. కొన్ని కథలను థియేటర్ లో చూస్తే అద్బుతంగా అనిపిస్తుంది... కొన్ని సినిమాలను రెండు మూడు గంటల సినిమాగా చెప్పడానికి వీలు పడదు. అలాంటి కథలను వెబ్‌ సిరీస్ లుగా తీస్తే బాగుంటుంది.

కనుక థియేట్రికల్‌ సినిమాలు.. ఓటీటీ కంటెంట్‌ మద్య పోటీ అనేది ఏమీ ఉండదు. ఒకదాని వల్ల మరోదానికి నష్టం కాని ఇబ్బంది కాని ఏమీ ఉండదు అన్నట్లుగా దీపిక చెప్పుకొచ్చింది. దీపిక వ్యాఖ్యలు కేన్స్ ఫిల్మ్‌ ఫెస్టివల్ లో చాలా మంది సినీ తారలు సమర్థించారు. రెండు వేరు వేరు ప్లాట్‌ ఫామ్స్ కనుక.. రెండు కూడా వేరు వేరుగా అభిమానులు ప్రేక్షకులను కలిగి ఉన్నారు కనుక వచ్చే ఇబ్బంది ఏమీ లేదని అంతా అంటున్నారు.