Begin typing your search above and press return to search.

సావిత్రి ఎండింగ్‌.. ఆడియన్స్ తట్టుకోగలరా?

By:  Tupaki Desk   |   28 May 2016 11:30 AM GMT
సావిత్రి ఎండింగ్‌.. ఆడియన్స్ తట్టుకోగలరా?
X
మహానటి సావిత్రి. అందుకు సెకండ్‌ ఒపీనియన్‌ మరో ఆప్షన్.. ఏదీ లేదు. సావిత్రి అంటే సావిత్రి అంతే. ఈ మహానటి జీవితంపై యంగ్‌ డైరక్టర్ నాగ్‌ అశ్విన్‌ సినిమా తీస్తానంటున్న విషయం మనం నిన్నే చెప్పుకున్నాం. అందుకే ఇప్పుడు అందరిదీ ఒకటే డౌటు. అసలు సావత్రి నిజ జీవితపు ఎండింగ్‌ ను నిజంగానే చూపిస్తారా?

నిజానికి తాగుడుకు భానిస అయిపోయిన సావిత్రి.. తన యావత్ జీవితాన్ని నాశనం చేసుకుంది. ఆమె జీవితంలో మెయిన్‌ ఎపిసోడ్‌ ఈ తాగుడు అనే చెప్పాలి. రోజూ రాత్రి మద్యం సేవించడం కారణంగా.. తాగి తినకపోవడం కారణంగా.. ఆమె చనిపోయేదశలో ఆమెను క్యూట్‌ లుక్ అంతాపోయి.. సన్నని గూడులా తయారైంది. ఇదంతా ఇప్పుడు నిజంగానే తెరపై చూపిస్తారా? పైగా మూడు సంవత్సరాలు ఆమె మందు మానేసిన తరువాత.. ఆదాయపు పన్ను శాఖ వారు ఆమె ఆస్తిని జప్తు చేశారనగానే.. ఆమె మరోసారి తాగి.. ఆ రాత్రి (1980 మే 11న) కోమాలోకి వెళ్లిపోయింది. ఆ మరుసటి ఏడాది 1981 డిసెంబర్‌ 26న మృతి మృతి చెందింది. మళ్లీ తిరిగి ఆమె ఒక్కసారి కూడా స్పృహలోకే రాలేదు. ఇదంతా తెర మీద చూపిస్తే అసలు తెలుగు సినిమా ప్రజలు తట్టుకోగలరా అనేది ఒక విషయం.

మరో విషయం ఏంటంటే.. అసలు సావిత్రి ఆస్తులను జప్తు చేసే నాటికి.. ఆమెతో నటించిన హీరోలూ హీరోయిన్లూ పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్నారు. రాజకీయాల్లో ఒక రేంజులో ఉన్నారు. మద్రాసును పాలిస్తున్నారు. వారు కనీసం ఆమెపై ఉన్న ఇన్ కం ట్యాక్స్ బకాయిలను రద్దు చేయించలేరా? ఒక ఆణిముత్యంలా వెలిగిన సావిత్రి కొవ్వొత్తిలా ఆవిరైపోతుంటే.. వీరందరూ ఏం చేసినట్లు? గతంలో ఆమె స్టార్డమ్ ను చూసి జెలసి ఫీలయ్యి.. ఆమె జీవిత పోరాటంలో ఓడిపోయినప్పుడు వీరందరూ పండగ చేస్కొనేవారని మరో రూమర్. ఇలాంటి ఎండింగ్స్ ఈమెపై తీసే బయోపిక్‌ లో ఉంటాయా?

పైగా సినిమాను తీస్తుంది ఒక తెలుగు వాడు.. ఒక తెలుగు ప్రొడ్యూసర్‌.. ఖచ్చితంగా మొహమాటాలకు పోయి కొన్ని నిజాలను దాచాల్సిందే. అలాంటప్పుడు ఈ ప్రయత్నమే వ్యర్ధం.